Home

»

Tv News

త్వరలో ఆనంద లహరి సీరియల్ తో నిరంజన్ మళ్ళీ ఆడియన్స్ ముందుకు

Nov 2, 2026 5:45PM


త్వరలో ఈటీవీలో ఒక కొత్త సీరియల్ ప్రసారం కాబోతోంది. ఆ సీరియల్ పేరు ఆనంద లహరి. ఈ సీరియల్ లో హీరో రోల్ లో నిరంజన్ నటిస్తున్నాడు. ఈ హీరో గతంలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ సీరియల్స్ లో నటించాడు. అలాగే హీరోయిన్ రోల్ లో విందుజా నటించబోతోంది. ఈమె మనసంతా సీరియల్ లో సింధు రోల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

" ఎవరూ దొరకనట్లు ఊరు పేరు లేని ఎవరినో మన ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేసావ్ " అంది ఒక ఆర్టిస్ట్. "కూర్గ్ లో ఇలాంటివి ఆర్గనైజ్ చేయడంలో అమ్మాయిని మించిన వాళ్ళు ఎవరూ లేరంటా " అన్నాడు మరొక ఆర్టిస్ట్. ఇంతలో ఒక ఆర్జే హరి వచ్చి రేడియోలో మాట్లాడుతూ ఉంటాడు. "హాయ్ నేను మీ ఆర్జే హరి ఫ్రమ్ మంగళగిరి .. ఒక స్త్రీని గెలవాలంటే తాను నిన్ను తలుచుకున్నప్పుడు ఆమె మొహంలో ఒక వెలుగు కనపడాలి. ఆమె పెదాల మీదా చిరునవ్వు వికసించాలి. అది ప్రేమంటే" అని చెప్పాడు హీరో. ఇంతలో మరో లేడీ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి నీతో గొడవ పడుతోంది అంటే అర్ధం ఏంటి " అని అడిగింది. "అది తలపొగరు కాదు " అన్నాడు ఆర్జే. "ఆమె నిన్ను గుండె నిండా ప్రేమిస్తోంది అని అర్ధం" అని చెప్పింది. "అలాంటి అమ్మాయి దొరకడమే అదృష్టం " అని చెప్పాడు ఆర్జే.

ఇక నెటిజన్స్ ఐతే నిరంజన్ ని చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. "వావ్ నిరంజన్ గారు న్యూ సీరియల్ నైస్. నిరంజన్  కి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ యష్ క్యారెక్టర్  డబ్బింగ్ ఆర్టిస్ట్ తో.హరి క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పించండి.   ఆల్ ది బెస్ట్ నిరంజన్. నిరంజన్ వాయిస్ బాగాలేదు ఒరిజినల్ వాయిస్ పెట్టండి" అంటూ కామెంట్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com