కొట్టడానికి వస్తున్నావ్ అనుకున్నా అన్నా..మంచు మనోజ్ తో ఆది సెటైర్
on Mar 18, 2025
ఉగాది పర్వదినం త్వరలో రాబోతోంది. దాంతో ఇక బుల్లితెర మీద షోస్ హడావిడి మొదలయ్యింది. "అనగనగా ఈ ఉగాదికి" పేరుతో ఒక షో ప్రసారం కాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి హోస్ట్స్ గా రష్మీ, నందు చేశారు. ఐతే గెస్టులుగా నితిన్, మంచు మనోజ్, ప్రదీప్ మాచిరాజు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ వచ్చారు. ఇక ఆది ఐతే నితిన్ ని చూసి లేచి డైలాగ్ చెప్పేసాడు. "నితిన్ అన్నా నేను మీకు పెద్ద ఫ్యాన్ ని...నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మీ జయం మూవీని చూసాను" అని చెప్పాడు. ఇక నితిన్ ఐతే ఆదికి కౌంటర్ ఇచ్చాడు. "ఆ మూవీ చేసేటప్పుడు నేను కూడా ఇంటర్ చదువుతున్నా" అన్నాడు. తర్వాత ఈ షోకి బలగం మూవీలో లీడ్ రోల్ చేసిన మురళీధర్ గౌడ్ వచ్చి ఆది పక్కన కూర్చుకున్నారు.
ఇంతలో స్టేజి మీదకు వచ్చిన మంచు మనోజ్ స్పీడ్ గా ఆది ఉన్న వైపుకు వెళ్ళాడు. మంచు మనోజ్ నడిచి వస్తున్న ఫోర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏదో కొట్టేయడానికి వస్తున్నాడేమో అని భయపడిపోయాడు. దాంతో మనోజ్ ని చూసేసరికిఆ దాటున లేచి నిలబడ్డాడు అలాగే పక్కనే ఉన్న మురళీధర్ గౌడ్ దగ్గరకు వెళ్లి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆది లేచి "నేనేమన్నా అన్నానేమో కొట్టడానికి వచ్చారేమో" అనుకున్నా అంటూ చెప్పేసరికి నారా రోహిత్, మంచు మనోజ్, నందు అందరూ గట్టిగా నవ్వేశారు. ఏదేమైనా మంచు మనోజ్ ఆటిట్యూడ్ మాత్రం ఆదిని బాగా బయపెట్టేసింది. ఫైనల్ లో "సరైన రోజు రిలీజ్ అవుతోంది...దుమ్ము దులిపేద్దాం మచ్చా" అంటూ మనోజ్ భారీ డైలాగ్ చెప్పాడు. ఈ ఎపిసోడ్ ఉగాది రోజు ఉదయం 10 గంటలకు ప్రసారం కాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
