ఓంకార్ మీద మండిపడ్డ అమర్....నీకు ఆ హక్కు లేదంటూ గట్టిగా వార్నింగ్
on Mar 13, 2025
బుల్లితెర మీద ఇష్మార్ట్ జోడి కొత్త సీజన్ 3 దుమ్ము రేపుతోంది. ఐతే ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ సరదాసరదాగా గడిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే ఫైట్ కాబోతోంది అన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజయిన ప్రోమోలో అమర్ దీప్ బాగా ఫైర్ అవడం అలాగే యాంకర్ ఓంకార్ కూడా సీరియస్ కావడం చూడొచ్చు.. ఒక టీమ్ గ్రీన్ డ్రెస్ లు, ఇంకో టీమ్ ఎల్లో డ్రెస్ లు వేసుకొచ్చారు. ఎప్పటిలాగే జోక్స్, నవ్వులు అన్నీ మామూలుగానే జరిగాయి. రాజేష్ , సుజాత బాగా నవ్వించారు. ఇక ఇక్కడ జోడీస్ కి సంబందించిన వాళ్ళ పేరెంట్స్ కూడా షోకి వచ్చారు. ఇక వాళ్ళ ఫామిలీ మెంబర్స్ ని పిలిచి ఈ షో మీద ఉన్న ఒపీనియన్ ని అడిగాడు ఓంకార్. ఫామిలీ అంటే ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి .. ఈ షో సొసైటీకి మంచి మెసేజ్ ని ఇస్తోంది. అలాగే వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది కూడా ఈ షో ద్వారా తెలుస్తోంది.
వైఫ్ అండ్ హజ్బెండ్ ఎలా కనెక్టెడ్ గా ఉండాలో చాలామంది నేర్చుకుంటున్నారు. ఇక ఓంకార్ ఐతే భర్తల చేతులకు కోన్స్ ఇచ్చి భార్యల చేతులకు గోరింటాకు పెట్టించాడు. తర్వాత మ్యూజికల్ ఆరెంజ్స్ అనే గేమ్ టాస్క్ ఇచ్చాడు. ఐతే ఇక్కడే చిక్కొచ్చింది..అమర్ దీప్ వాళ్ళ టీమ్ ని రంజీ టీమ్ గా పోల్చి తమ టీమ్ కి ఛాంపియన్స్ టీమ్ అని పెట్టుకున్నాడు. "నే చెప్పనా రంజీ ట్రోఫీ ఓడిపోతావ్ ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ ఇన్నింగ్స్ " అంటూ కామెంట్ చేసేసరికి అమర్ దీప్ కి కోపం వచ్చేసింది. "మనలో ఒకడు గెలిచాడని ఎలా సంతోష పెడతామో మన పక్కన వాడు పడిపోయినప్పుడు అలాగే బాధపడాలి" అంటూ సీనియర్ నటుడు ప్రదీప్ మీద ఏంటన్నా ఆ డైలాగ్ అంటూ ఫుల్ ఫైర్ అయ్యాడు. మధ్యలో ఆది వచ్చి "అంతా ఐపోయాక అందరూ వెళ్లి మాట్లాడతారు బ్రో" అన్నాడు. "ఆది నేను నీ గురించి మాట్లాడలేదు" అన్నాడు అమర్. "పెర్సొనాలిటీని ఒక్క సీన్ తో అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు" అంటూ అభయ్ వైఫ్ రాకింగ్ రాకేష్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో ప్రేరణ వచ్చి ఏదో దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఎలా అనేసరికి...అక్కానీకు సంబంధం లేదు .. నువ్వుండక్కా అంటూ అమర్ మండిపోయాడు. ఇక ప్రదీప్ వచ్చి "మరి ఎవరికీ సంబంధం ఉంది" అంటూ రెచ్చిపోయాడు. తర్వాత ఓంకార్ కూడా అమర్ దీప్ వాళ్ళను ఉద్దేశించి "మీరు ఒక స్ట్రాటజీతో ఉన్నారు. అది మిస్ అవడం వల్ల..ఏదో డిస్టర్బ్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళ సెలబ్రేషన్ ని నాతో సహా ఆప్ హక్కు ఎవరికీ లేదు" అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
