నాకు బట్టలు కుట్టిస్తారా?
on May 31, 2021
బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తోంది. సీజన్ 3లో పాల్గొన్న చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో బాగా ఫేమస్ అయ్యారు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి వారిలో అలీ రెజా ఒకరని చెప్పాలి. బుల్లితెర, వెండితెర పలు ఆఫర్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇటీవల నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' సినిమాలో కీలకపాత్ర పోషించాడు అలీ రెజా. అయితే ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అలీ.. తన కొత్త సినిమా అప్డేట్ ను ఇచ్చాడు. 'G.D' అంటూ వదిలిన సినిమా పోస్ట్ బాగానే క్లిక్ అయింది. తాజాగా అలీ తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చట్లు పెట్టాడు.
ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. ఇందులో కొందరు వ్యక్తిగత విషయాలను కూడా అడిగారు. 'ముద్దు పేరు ఏంటి..?', 'వదినను అసలు చూపించడం లేదేంటి..?' లాంటి ప్రశ్నలు అడగగా.. చిన్నతనం నుంచి అందరూ తనను అలీ అనే పిలుస్తారని, కానీ పెళ్లి తరువాత తన భార్య బాబు అని పిలుస్తోందనీ తెలిపాడు. ఇక ఓ నెటిజన్ ఏకంగా బాడీ కొలతలు అడిగాడు. దానికి అలీ రెజా.. 'నాకు బట్టలు కుట్టిస్తారా ఏంటి..?' అంటూ సెటైర్ వేశాడు.