పరదేశి గుండెపై 'ఐశ్వర్య'
on Sep 13, 2022

బుల్లి తెర షోస్‌లో పచ్చబొట్ల ట్రెండ్ నడుస్తోంది. లవర్స్ నేమ్స్ శరీరంలో ఎక్కడంటే అక్కడ పచ్చబొట్లుగా పొడిపించేసుకుని, దాని వెనక ఒక స్టోరీని అల్లేసి, షోస్‌లో అదే రియల్ లైఫ్ స్టోరీగా మేకప్ వేసేసి, అందరి చేతా కన్నీళ్లు పెట్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటి వరకు 'జబర్దస్త్' స్టేజి మీద లవ్ పుట్టి, 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ప్రపోజ్ చేసుకుని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద పెళ్లి చేసేసుకుని కొత్త ఈవెంట్స్ లో పిల్లలతో వస్తున్నారు చాలా మంది కమెడియన్స్. అలాంటి లవ్ స్టోరీస్ లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు పరదేశి, ఐశ్వర్య.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో స్టార్టింగ్ లో పరదేశి గుండెల మీద 'ఐశ్వర్య' అనే పేరుతో ఉన్న ఒక పచ్చబొట్టును చాలా దగ్గర నుంచి చూపించారు. ఇక పక్కనే ఉన్న ఐశ్వర్య అది చూసి ఫుల్ ఖుష్‌తో నవ్వుతూ కనిపించింది. ఇంటర్నేషనల్ ఫస్ట్ డే లవ్ సందర్భంగా ఈ కొత్త జోడి ఇప్పుడు సందడి చేస్తోంది.
ఐశ్వర్య.. 'జబర్దస్త్' ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఐతే పరదేశి-ఐశ్వర్య మధ్య ఎప్పుడు, ఎక్కడ మొదలైందనే విషయాలు ఏమీ ప్రోమోలో చూపించలేదు. వీళ్ళిద్దరూ నిజంగా జోడీనా? లేదంటే ఈ షో కోసం క్రియేట్ చేశారా? అనే విషయం తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



