అప్పుడే హగ్ ఐపోయిందా...ఊడ్చినంత సేపు లేదేమిట్రా
on Feb 13, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో వాలెంటైన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఆ ప్రోమో చూస్తే ఫుల్ ఫన్నీగా ఉంది. ముందు విష్ణుప్రియ ఫుల్ కలర్ ఫుల్ డ్రెస్ లో అది కూడా హాట్ గా ఉండే రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో వచ్చి చీపురు కట్ట పట్టుకుని స్టేజి మీద మీద ఉన్న చెత్త మొత్తాన్ని ఊడ్చేసింది. ఇంకో కార్నర్ లో నిలబడి పని ఎలా చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. తర్వాత శ్రీముఖి వచ్చి "విష్ణు చేసిన పనికి ఇంప్రెస్స్ అయ్యావా"అని అడిగింది. ఇంప్రెస్డ్ అని బోర్డు చూపించాడు పృద్వి . "దేనికి ఇంప్రెస్డ్" అని అడిగింది శ్రీముఖి. "ఎం చేయలేదు అదే నచ్చింది నాకు" అన్నాడు. తర్వాత హరి వచ్చి "ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మా అమ్మగారు చూపిస్తారు" అంటూ శ్రీముఖి చేతికి చీపురు కట్ట ఇచ్చాడు. శ్రీముఖి "బాలు ఇది నీ కోసమే" అంటూ చీర కొంగును బొడ్లో దోపుకుని చీపురు పట్టుకుని తెగ ఊడ్చేసింది. వెంటనే రోహిణి కూడా చీపురు కట్ట తీసుకుని శ్రీముఖికి పోటీగా వచ్చేసింది.
"నీకొక్క దానికేనా బాలు మీద ప్రేమా నాకు కూడా బాలు మీద ప్రేమ ఉంది" అంటూ రోహిణి తెగ ఊడ్చేసింది. "బాలు ఇంప్రెస్డ్" అని అడిగారు రోహిణి, శ్రీముఖి. యా అంటూ గ్రీన్ బోర్డు చూపించాడు బాలు. "నా కోసం ఎవరైనా అమ్మాయి ఇలా ఓడిస్తే వెంటనే వచ్చి ఒక హగ్ ఇచ్చేవాడిని కానీ బాలు మాత్రం వచ్చి ఒక్క హగ్ ఇవ్వలేడా" అంటూ హరి అడిగాడు. వెంటనే బాలు వెళ్లి శ్రీముఖిని హగ్ చేసుకున్నాడు. "ఓకే ఓకే వదలండి" అంది శ్రీముఖి. "ఐపోయింది ఐపోయింది అమ్మగారు" అంటూ అవినాష్ కూడా వదలండి అమ్మగారు అంటూ చెప్పాడు. శ్రీముఖి మాత్రం "అప్పుడే హగ్ ఐపోయిందా. ఊడ్చినంత సేపు లేదేమిట్రా " అనేసరికి అందరూ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



