రెంట్ ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయించిన ఆదిరెడ్డి!
on May 23, 2023
ఆదిరెడ్డి.. బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయ్యాడు. ఒక కామన్ మ్యాన్ గా, ఒక రివ్యూయర్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి.. తన మైండ్ గేమ్ తో గట్టి పోటీ ఇవ్వటమే కాకుండా, హౌస్ లో మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ హౌజ్ లో ఆదిరెడ్డికి డ్యాన్స్ రాకపోయినా కానీ హోస్ట్ నాగార్జున డ్యాన్స్ చేయమనగానే చేసేసాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరి స్క్రీన్ టైం తో పోలిస్తే ఆదిరెడ్డి స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించే వాడు. హౌస్ లో ఆదిరెడ్డి ఉన్నప్పుడు ఒక వీక్ లీడర్ అయ్యాడు. కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు, రివ్యూయర్ టీం లీడర్ అయ్యాడని నాగార్జున చెప్పగానే ఆ వారం అంతా ఆదిరెడ్డి ట్రెండింగ్ లో ఉన్నాడు.
హౌజ్ లో ఉన్నన్ని రోజులు గీతుతో స్నేహం చేసిన ఆదిరెడ్డి.. మిగతా కంటెస్టెంట్స్ తో అంతలా కలవలేకపోయాడు. హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు వాళ్ళ పాప అద్విత రావడం.. తనని చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అవ్వడం.. తన భార్య కవితకు ఐ లవ్ యూ అని చెప్పడం.. ఇదంతా ఒక బ్యూటిఫుల్ మెమోరీగా ఉందని చెప్పాడు ఆదిరెడ్డి.
బిగ్ బాస్ తర్వాత ఆదిరెడ్డి తన సొంతూరికి వెళ్ళాడు. అక్కడ తన ఫ్యామిలీతో టైం గడుపుతున్నాడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ కి రివ్యూ చేస్తున్నాడు. ఆదిరెడ్డి తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో షేర్ చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక అనాధాశ్రమంకి వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేయడంతో ఆ వ్లాగ్ ని యూట్యూబ్ లో చూసినవాళ్ళంతా ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత తను ఐపీఎల్ కోసం వెళ్తున్నట్టు, తన చెల్లికి బంగారం తీసుకునేది, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు గృహ ప్రవేశం చేసినట్లు ఇలా అన్ని వ్లాగ్ లని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా వాటికి మంచి వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆదిరెడ్డి అద్దెకు ఉండే ఇంటికి సీసీటీవి కెమెరాలు ఫిక్స్ చేయించాడు.
అదెందుకంటే వాళ్ళు ఉండే ఇల్లు కొంచెం దూరంగా ఉందని.. పక్కన మూడు, నాలుగు ఇల్లు తప్ప ఏవీ లేవని.. తను ఇంట్లో లేనప్పుడు వాళ్ళ భార్య, కూతురు, చెల్లి మాత్రమే ఉంటారని భయంగా ఉండకుండా సీసీటివి ఫిక్స్ చేపించానని చెప్పాడు ఆదిరెడ్డి. అయితే ఈ వ్లాగ్ లో తన అన్నయ్యని కూడా పరిచయం చేసాడు ఆదిరెడ్డి. వాళ్ళ ఊరు, పొలం ఇలా అన్నింటిని చూపిస్తూ తను బాల్యంలో ఎలా ఉండేవాడో అన్నింటిని ఈ వ్లాగ్ లో ఆదిరెడ్డి వివరించాడు.
Also Read