ఏస్ ఫోటోగ్రాఫర్ గా...న్యూ నికాన్ క్రియేటర్ గా సదా సయ్యద్
on Jan 6, 2024
జయం మూవీలో నటించిన సదా గురించి అందరికీ తెలుసు. "వెళ్ళవయ్యా వెళ్ళు" అనే డైలాగ్ తో మంచి ఫేమస్ కూడా అయ్యింది. ఆ తర్వాత తమిళ్ లో మాధవన్, విక్రమ్ తో కలిసి ‘ఎతిరి’, ‘అన్నియన్’ మూవీస్ లో కూడా నటించింది. ఐతే కొంత కాలం నుంచి సదా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో ఆమె అన్ని రకాల ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తోంది. ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది సదా. స్టార్ మాలో టెలికాస్ట్ ఐన 'నీతోనే డ్యాన్స్'షోలో సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్‌తో పాటు సదా కూడా జడ్జీగా పని చేసింది.
సినిమా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి అప్పటినుంచి ఆమె బుల్లితెరకి వచ్చేసింది . కన్నడలో 2014లో వచ్చిన జోడి నం.1 అనే డ్యాన్స్ షోకి జడ్జిగా, తర్వాత 2016లో తెలుగు డ్యాన్స్ షో ఢీ జూనియర్స్ 1, 2 సీజన్లకు జడ్జిగా, 'ఢీ జోడి'లో కూడా కంటిన్యూ చేసింది. చివరిగా 2018లో 'టార్చ్‌లైట్' అనే మూవీలో నటించింది. ఇక ఇప్పుడు ఆమెకు నికాన్ ఫామిలీ వెల్కమ్ చెప్పింది. " సదా సయ్యద్‌ను మా ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నాం. వృత్తిరీత్యా నటి ఐనా కూడా సదాకు వన్య ప్రాణులంటే చాలా ఇష్టం. అలా ఆమె 2021 అక్టోబర్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా, పన్నా టైగర్ రిజర్వ్‌లో తన మొదటి జంగిల్ సఫారీకి వెళ్లినప్పుడు అక్కడి వన్యప్రాణులను చూసి వాటి మీద ఆమె ఆసక్తి పెంచుకుని జంగిల్ సఫారీలను చిత్రాలుగా తీశారు. 2022లో నికాన్ Z 6IIతో కూడిన ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీలోకి దూసుకెళ్లారు.
కాబట్టి మేము నికాన్ కుటుంబానికి సదాను స్వాగతిస్తున్నాము...ఆమె వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ ప్రయాణంలో భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది" అంటూ నికాన్ కంపెనీ చెప్పింది. సదా తన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కోసం నికాన్ Z 6II కెమెరాని వాడుతూ ఉంటుంది. ఈ కెమెరా ఖరీదు రెండున్నర లక్షలు... దీంతో తన అభిరుచుని నెరవేర్చుకునే పనిలో పడింది సదా. ఇక ఈ కెమెరాతో టైగర్ వాకింగ్ ని క్లోజప్ లో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నారు నెటిజన్స్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
