నాకంటే నా కూతురు చాలా ధైర్యవంతురాలు
on Sep 27, 2022

నటి ప్రగతి ఐతే బుల్లి తెర మీద అటు బిగ్ స్క్రీన్ మీద ఫుల్ ఫేమస్. అన్ని రకాల క్యారెక్టర్స్ చేసింది ప్రగతి. ఇప్పటి కొత్త తరం నటీనటులకు ధీటుగా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమెకు ఆరోగ్య కాంక్ష కూడా ఎక్కువే అందుకే టైం ఉన్నప్పుడు జిమ్ లో కుస్తీలు పడుతూ కండలు పెంచుతూ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రగతి డాటర్స్ డే సందర్భంగా తన కూతురి చేతి మీద ముద్దు పెడుతూ ఉన్న ఫోటో ఒకదాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నా ఆశ, నా బలం, నా ఆనందం, నా ఆత్మవిశ్వాసం, నా గర్వం... నా సర్వస్వం నువ్వే. నీలాంటి కూతురు ఉన్నందుకు గర్వంగా ఉంది !!! నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను..ప్రేమతో ...లవ్ యూ అమ్ములు" అంటూ ఒక టాగ్ లైన్ కూడా పెట్టింది.
ప్రగతి తన కూతురి గురించి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంది.. తన కంటే తన కూతురికి చాలా ధైర్యం ఎక్కువ అని. ఇక ఈ తల్లీకూతుళ్ల ఫోటోకి నెటిజన్స్ "అందమైన కూతురు, జిమ్ చేసే మదర్, తల్లెవరూ, కూతురెవరు ఇద్దరిలో ?" అంటూ కామెంట్స్ చేశారు. ఇక లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి "మా పెద్దమ్మ" అంటూ కామెంట్ చేసేసరికి ప్రగతి కూడా కొన్ని ఎమోజిస్ తో రిప్లై ఇచ్చింది. ఇక ప్రగతి భాషతో సంబంధం లేకుండా నటించేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



