జీవన్ అన్నా..అదిరిపోయే రూత్ లెస్ విలన్ క్యారెక్టర్ చెయ్యి అన్నా...ఒక నెటిజన్ సలహా
on Mar 22, 2025
నటుడు జీవన్ ఇంతకు ముందు ఎవరో తెలీదు కానీ ఇప్పుడు బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఎందుకంటే సుమతో కలిసి చెఫ్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అనే షో చేస్తున్నాడు. అందులో గుండుతో కనిపిస్తూ రకరకాల వంటల టాస్కులు ఇస్తూ జోడీస్ చేసే వంటలు తింటూ వంకలు పెడుతూ టేస్టో మీటర్ లో మార్క్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి జీవన్ లో చాలా కోణాలు ఉన్నాయి. మంచి వంటలు చేస్తాడు, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే గుణం ఉన్నవాడు, మంచి కమెడియన్ అలాగే జిమ్ లో మంచి వర్కౌట్ చేస్తూ అందరినీ మెస్మోరైజ్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా జీవన్ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అందులో జిమ్ లోకి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించాడు . ఇక నెటిజన్స్ ఐతే ఆ వీడియో చూసి షాకయ్యారు.
"ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు...జీవన్ అన్ననా మజాకా...సిక్స్ ప్యాక్ ట్రై చెయ్యి..." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఐతే "అన్నా ఒక మాస్ విలన్ రోల్ చెయ్యి..అన్నా బీస్ట్ మోడ్ లో ఉన్నావ్...రూత్ లెస్ విలన్ క్యారెక్టర్ చెయ్యి అన్నా" అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక జీవన్ గురించి చెప్పాలంటే.."ఈ నగరానికి ఏమైంది" అనే మూవీతో జీవన్ ప్రయాణం మొదలయ్యింది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన "జాతి రత్నాలు" మూవీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసే రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ ద్వారా కరోనా సమయంలో ఎంతో మందికి భోజనం అందించాడు. అలాంటి జీవన్ రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ చేసే నష్టాన్ని వివరిస్తూ ఒక వీడియో కూడా చేసాడు. పావలా శ్యామలా గారి పరిస్థితి చూసి ఆమెకు కూడా కొంతవరకు సాయం చేసాడు జీవన్. అలా జీవన్ బుల్లితెర మీద సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
