కావ్య, సుధీర్ లవ్ ట్రాక్...లైవ్ లో ప్రపోజ్ చేసుకున్న రాధికా శరత్ కుమార్
on Feb 10, 2026
.webp)
ఆట ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్ కూడా అదే స్పెషల్ థీమ్ తో రాబోతోంది. "మీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి" అని జానీ మాష్టర్ ని అడిగాడు సుధీర్. "నా దృష్టిలో ప్రేమంటే మా అమ్మ" అంటూ ఆన్సర్ ఇచ్చాడు. "లైఫ్ లో ఒక్కసారైనా రియల్ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా చాలా లక్కీ. నేను చాలా లక్కీ అనుకుంటున్నా" అంది నిహారిక. తర్వాత కావ్య మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్ తో వచ్చింది. "హా తిన్నాను. బానే ఉన్నా. బానే జరుగుతుంది షూటింగ్" అంటూ తనకు తానె ఆన్సర్స్ ఇచ్చేసాడు. "నేనేమీ మాట్లాడట్లేదు కదా" అంటూ కావ్య అడిగింది. "మీరు మాట్లాడకపోతే మీ కళ్ళు మాట్లాడుతున్నాయి నాతో" అంటూ బాగా పులిహోర కలిపాడు.
తర్వాత జడ్జ్ అందాల నటి రాధికా వచ్చేసరికి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పాడు. "నీలాంటి ఒక అందమైన సుధీర్ నాకు చెప్పడం" అంటూ సిగ్గుపడిపోయారు. తర్వాత సుధీర్ తో కలిసి డాన్స్ చేశారు. ఇక శరత్ కుమార్ ఫోన్ చేశారు. "ఎస్ మామ హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పారు" దాంతో "రాధికా హ్యాపీ వాలెంటైన్స్ డే కానీ ఇదంతా లైవ్ లో చెప్పకూడదు" అంటూ ఆట పట్టించారు. పక్కనుంచి సుధీర్ ఏదన్నా "గిఫ్ట్ అడగండి" అని రాధికను ఎంకరేజ్ చేసేసరికి అవతలి వైపు నుంచి "నేనే ఒక గిఫ్ట్" అన్నారు శరత్ కుమార్. దాంతో అందరూ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



