రెండేళ్లలో నిఖిల్ పెళ్లి...షాక్ తో షో నుంచి వెళ్లిపోయిన కావ్య
on Jan 1, 2025
‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ఎపిసోడ్ మొత్తం కావ్య - నిఖిల్ చుట్టూనే తిరిగింది. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నారు. నిఖిల్ నల్ల జోడు పెట్టుకుని చూసే ప్రయత్నం చేసాడు కానీ కావ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఐతే ఈ షోలో ఫైనల్ గా నిఖిల్ తల్లి సులేఖ ఎంట్రీ ఇచ్చారు. అయితే సులేఖ అలా వచ్చిందో లేదో కావ్య షో నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇంకా నిఖిల్ తన తల్లి గురించి తల్లి సులేఖ కొడుకు గురించి పొగుడుకుంటూ ఉన్నారు. నిఖిల్ వాళ్ళ అమ్మకు పెద్ద ఫ్లవర్ బొకే ఇచ్చాడు అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకెళ్తానని, రెస్టారెంట్ కి తీసుకెళ్తానని, సినిమాకు తీసుకెళ్తానని అలాగే మంచి ఇల్లు కొంటానని, వాళ్ళ అమ్మ - నాన్నను రొమాంటిక్ ట్రిప్ కి పంపిస్తానని ఇలా ప్రామిస్ చేసాడు. ‘చిన్నప్పటి నుంచి మా అమ్మ కష్టపడి పెంచింది. నా కోసం తమ్ముడి కోసం చాలా త్యాగం చేసింది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆమె వల్లే. మా అమ్మ పెంపకమే నన్ను ఇంత దూరం తెచ్చింది. నాపై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా నన్ను వదలకుండా నాతోనే ఉంది’ అని ఎమోషనల్‌గా చెప్పాడు నిఖిల్. ఇక ఫైనల్ గా శ్రీముఖి కూడా అడగాల్సిన విషయమే అడిగేసింది. "చాలా మంది అమ్మాయిలకు ఒక డౌట్ ఉంది. మా నిఖిల్ పెళ్లి ఎప్పుడు" అని అడిగింది. "మీరో రెండేళ్లలో పెళ్లి చేస్తాను" అని చెప్పింది సులేఖ. ఇక ఫైనల్ గా అందరినీ పిలిచి కేక్ కట్ చేయించింది శ్రీముఖి. ఇక నిఖిల్ తల్లి షో నుంచి వెళ్లిపోయేసరికి కావ్య మళ్ళీ స్టేజి మీద ప్రత్యక్షమయింది. కేక్ కటింగ్ లో పార్టిసిపేట్ చేసింది. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా కావ్య తన డెసిషన్ చెప్పింది. రాబోయే రోజుల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా రైట్ డెసిషన్స్ తీసుకుంటూ కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా అంటూ చెప్పింది.
Also Read