మెల్లి మెల్లిగా సోనియాల మారుతున్న యష్మీ..... ఇక బట్టలు సర్ధుకోవాల్సిందే!
on Oct 4, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో వరెస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకొని సోనియా హౌస్ లో నుండి అనూహ్యంగా బయటకు వచ్చింది. సోనియా బయటకు రావడానికి చాలా కారణాలే ఉన్నాయ్ కానీ నిఖిల్, పృథ్వీలతో సన్నీహితంగా ఉండడం.. వాళ్ళని మ్యానిప్యులేట్ చెయ్యడం.. ఇవ్వన్నీ కూడా కారణాలే అయితే ప్రతీ దాంట్లో పృథ్వీ, నిఖిల్ మాట్లాడాల్సిన చోట కూడ తనే మాట్లాడడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
అయితే సోనియా హౌస్ నుండి బయటకు వచ్చాక తన బాధ్యతలన్నీ యష్మీకి అప్పజెప్పినట్లుంది. సోనియా వచ్చే ముందు ఇద్దరు ఒకే క్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు హౌస్ లో నిఖిల్ క్లాన్ లో యష్మీ ఉంది. ఇప్పుడు కూడా నిఖిల్ , పృథ్వీలని యష్మీ మ్యానిప్యులేట్ చేస్తుంది. నిన్న జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో పృథ్వీ ఒడిపోయాడు. సంఛాలక్ గా ఉన్న ప్రేరణని సపోర్ట్ చేయనందుకు తనపై గొడవేసుకుంది యష్మీ. ఓడిపోయినవాడు బానే ఉన్నాడు.. క్లాన్ చీఫ్ బానే ఉన్నాడు.. మధ్యలో యష్మీ కీ ఏంటి అంటు నిన్నటి నుండి సోషల్ మీడియాలో యష్మీ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. టాస్క్ తర్వాత అందరు కూడా నార్మల్ అయిన కూడా పృథ్వీ ఓడిపోయాడంటూ యష్మీ ఏడ్చేసింది.
నిన్న ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే ఆలోచన వస్తుంది. సోనియా ప్లేస్ ని రీప్లేస్ చేస్తన్నట్టుగా ఉంది యష్మీ.. ఇక బట్టలు సర్దుకోవాల్సిందే అంటు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో రెండు క్లాన్ లు ఉన్నాయి.. అఫీషియల్ గా మొత్తం ఒకటే క్లాన్ అయినా నిఖిల్, పృథ్వీ, యష్మీ ఒక బ్యాచ్ అయ్యారు. నిన్న జరిగిన టాస్క్ లో గెలిచిన నబీల్ మెగా చీఫ్ అయ్యాడు. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత ఓటింగ్ లైన్స్ ఆన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే మిగతావారు ఇంకా నామినేషన్ లో ఉన్నారు. ఈ సారి నైనిక ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరుగబోతున్నాయి. వాళ్ళు హౌస్ లోకి వచ్చాక కూడా నిఖిల్, పృథ్వీలతోనే యష్మీలతో తిరుగుతుందో లేదో చూడాలి.
Also Read