ENGLISH | TELUGU  
Home  » TV News

హౌస్ లో స్నేక్ ఎవరు? లాడర్ ఎవరు?

on Nov 24, 2024

బిగ్ బాస్ సీజన్-8 పన్నెండో వారం‌ ముగింపుకి వచ్చేసింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీ-గౌతమ్ ల మధ్య జరిగిన గొడవ, విష్ణుప్రియ-రోహిణిల మధ్య జరిగిన గొడవ గురించి డిస్కషన్ చేశాడు నాగార్జున.

హౌస్‌‌‌ లో చివరి మెగా చీఫ్‌ గా రోహిణి ఎంపిక అయ్యింది. ఇక ఫినాలేకి ముందు అంతా నడిచేదంతే టికెట్ ఫినాలే వార్. సరిగ్గా ఈ రేస్ మొదలు కాబోతుండగా.. నాగార్జున ఒక బిగ్ బాంబ్ విసిరారు. హౌస్‌లో వాళ్లతో స్నేక్ టాస్క్ ఆడించాడు. మీ ఆటలో మీకు అడ్డు తగులుతున్న వాళ్లు ఎవరు? వెనక్కి లాగుతున్న వాళ్లు ఎవరని కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. రోహిణి క్యారెక్టర్ గురించి నోరు పారేసుకున్న విష్ణు ప్రియని చాలా సుతిమెత్తగా క్లాస్ పీకాడు నాగార్జున. దాన్ని క్లాస్ అని కూడా అనలేం.. ఎంతైనా తన ప్రియమైన కళామ్మతల్లి ముద్దు బిడ్డ కాబట్టి చాలా ముద్దుగానే సర్దిచెప్పాడు నాగార్జున.  ఇక హౌస్ లో స్నేక్ ఎవరు లాడర్(నిచ్చెన) ఎవరో చెప్పమని కంటెస్టెంట్స్ ని నాగార్జున అడిగాడు.  విష్ణుని అడగడంతో.. ఆమె పృథ్వీ మైకంలోనే ఉంది కాబట్టి పృథ్వీ పేరే చెప్పింది. పృథ్వీ వల్ల ఆక్సిజన్, కార్బన్‌డైయాక్సైడ్ వస్తుంది సర్ అని చెప్పింది. ఆమె ఏమి సోది చెప్పినా నాగార్జున అలా వింటుంటాడు. మొదటి నుంచి ఈ పత్తేపారం అలా సా..గుతూనే ఉంది. ఇక మెగా ఛీఫ్ రోహిణిని అడుగగా.. తనని మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న అవినాష్ కి లాడర్ ఇచ్చింది. పృథ్వీకి స్నేక్ ఇచ్చింది.

టేస్టీ తేజని అడుగగా అవినాష్ కి లాడర్, విష్ణుప్రియకి స్నేక్ ఇచ్చాడు. తను మెగా ఛీఫ్ లో ఉన్నప్పుడు ఏడు గ్లాస్ లు తీసుకెళ్తుంటే విష్ణుప్రియ పడేసిందంటూ కారణం చెప్పాడు. నిఖిల్‌ తన ఆటని కిందకి లాగాడని తనకి స్నేక్ ఇచ్చి, పృథ్వీకి లాడర్ ఇచ్చాడు నబీల్. ఆ తర్వాత  గౌతమ్‌కి స్నేక్ ఇచ్చాడు పృథ్వీ. ఇక యష్మీ గౌడ.. నిఖిల్‌కి షాకిస్తూ.. అతన్ని స్నేక్ అని అనేసింది. నన్ను ఎక్కువ హర్ట్ చేసింది నిఖిలే అని చెప్పింది యష్మీ. ఆమె దృష్టిలో హర్ట్ అంటే.. ఆమె లవ్‌ని యాక్సెప్ట్ చేయకపోవడమేమో కానీ.. హర్ట్ చేశాడని చెప్పింది యష్మీ. ఇలా కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ముందు చిచ్చు పెట్టాడు నాగార్జున.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.