యు ఆర్ మై ఇనయా.. నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా ప్రేమ తగ్గదు!
on Oct 8, 2022

బిగ్ బాస్‌లో నిన్న మొన్నటి వరకు ఇనయా, సూర్య అంటే ఇద్దరు మంచి స్నేహితులు అని హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు అనుకున్నారు. అయితే రోజుకో మలుపు తిరిగే ఈ షో, నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇనయా, సూర్య ప్రవర్తన కాస్త భిన్నంగా అనిపిస్తోంది. ఇనయా, సూర్యకి సపోర్ట్ చేస్తూ, తన ఎమోషన్ ని దాచుకోలేకపోయింది. బిగ్ బాస్ అంటేనే టాస్క్, గేమ్, ఎంటర్టైన్మెంట్, హంగామా, ఎమోషనల్ సీన్స్, సీక్రెట్ టాస్క్, లవ్ బర్డ్స్. అయితే వీటన్నింటిలో బాగా ఆసక్తిని చూపేది ' సీక్రెట్ లవ్'. సూర్య, ఇనయాల మధ్య సీక్రెట్ లవ్ మొదలయ్యిందా? అంటే అవుననే అనుకుంటున్నారు ప్రేక్షకులు!
నిన్న జరిగిన ఒక టాస్క్ లో సూర్యకి సపోర్ట్ చేయలేకపోయానని ఇనయా బాధపడుతూంటే, సూర్య తన దగ్గరకు వచ్చి, "నువ్వు ఏం బాధపడకు. ఇది ఒక గేమ్ మాత్రమే. నీకు నాకు మధ్య గొడవ జరిగినా, నిన్ను చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళేంత చనువు ఉంది. నీతో గొడవ పడేంత చనువు ఉంది. నీకు అన్నం తినిపించేంత చనువు ఉంది" అంటూ సూర్య చెప్తూంటే, ఇనయా సిగ్గుపడుతూ 'నీకు ఆ రైట్ ఉంది' అని నవ్వేసింది.
ఈ సీన్ లో తను ఒక రకమైన ఫీలింగ్ లో ఉన్నట్లుగా ఉంది. ఈ విషయం చూసిన ప్రేక్షకులకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అయితే తర్వాత ఇనయా తన ఓట్ ని రేవంత్ కి వేసి, దూరంగా వచ్చి బాధపడుతోంది. అది చూసి సూర్య తన దగ్గరకు వెళ్ళి "నువ్వు ఓటు వేసినా వేయకపోయినా 'You are my Inaya', నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా ప్రేమ తగ్గదు" అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇనయా తనకి హగ్ ఇస్తూ కంటతడి పెట్టుకుంది.
సూర్య లాస్ట్ వీక్ వరకు ఆరోహితో ప్రేమలో ఉన్నాడని అనుకున్న ప్రేక్షకులు మాత్రం, ఈ రోజు ఎపిసోడ్ చూసాక సూర్య, ఇనయాకి మధ్యలో 'Something something' ఉంది అనే అనుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇవన్నీ కంటెంట్ కోసం వీళ్ళిద్దరు ఆడుతున్న గేమ్ లా అనిపిస్తోందని అనుకుంటున్నారు. అయితే మునుముందు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగబోతుందో? ఎంత వరకు వీళ్ళిద్దరు కలిసి ఉంటారో? చూడాలి మరి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



