Jayam serial : ప్రసాదరావు మాటలకి షాకైన గంగ , రుద్ర.. వీరు ప్లాన్ సక్సెస్!
on Feb 13, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -191 లో.. ఇంట్లో వాళ్ళ దృష్టిలో రుద్రని గంగ హీరోని చేసిందని వీరు ఒక ప్లాన్ చేస్తాడు. అదేంటంటే రుద్ర సాయం పొందిన ఒకతన్ని బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి రప్పిస్తాడు. అదంతా నాతో కావాలనే చెప్పించారని మళ్ళీ అబద్దం చెప్తాడు అతడు. రుద్ర అతని భార్య కలిసి నాతో ఇలా చెప్పించారని అతను చెప్పగానే అందరు షాక్ అవుతారు.
అతను మాట్లాడేది చూసి గంగ షాక్ అవుతుంది. ప్రసాదరావు మీరు ఇలా మాట్లాడతున్నారు ఏంటని రుద్ర అడుగతాడు. మీ భార్య మీరు కలిసి ఇదంతా చేశారని చెప్పి అతను వెళ్ళిపోతాడు. దాంతో శకుంతలకి వచ్చిన మంచి అభిప్రాయం పోతుంది. మరొకవైపు భలే ప్లాన్ చేసావ్ వీరు అని పారు అంటుంది. రుద్ర దగ్గరికి గంగ వస్తుంది. మీరు చేసిన మంచి అందరికి చెప్పాలని అనుకున్న కానీ ఇలా జరిగింది.. ఆయన చెప్పి వెళ్ళాక మధ్యలో ఏదో జరిగిందని రుద్రతో గంగ చెప్తుంది. అదంతా పైనుండి ఇషిక, వీరు, పారు వింటారు. ఇప్పుడు రుద్ర వెళ్లి అతన్ని అడిగితే అతను నిజం చెప్తాడమోనని పారు అంటుంది.
మరొకవైపు ప్రసాదరావు వెళ్తుంటే రుద్ర వెళ్లి ఇలా ఎందుకు అబద్ధం చెప్పారని అడుగతాడు. అప్పుడే పారు వస్తుంది. ఏంటి రుద్ర అతనితో నీకేంటి.. నీ మంచితనం నీకే శాపం అయిందని పారు కన్నింగ్ గా మాట్లాడతుంది. మీరు ఏంటి నన్ను అడుగుతున్నారు.. అన్యాయంగా బాక్సింగ్ లో గెలిచి మీ తమ్ముడుని కోపంతో చంపారని రుద్రతో ప్రసాదరావు అనేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



