అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు..నన్ను జబర్దస్త్ నుంచి తీసేసారు
on Dec 3, 2024
కమెడియన్ తిరుపతి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్ల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన కమెడియన్. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గడం కొత్తవాళ్లు రావడం వంటి వాటి వలన ఆయన ఎక్కువగా తెర మీద కనిపించడం లేదు. అలాంటి తిరుపతి ప్రకాష్ జబర్దస్త్ లో చేశారు కానీ సడెన్ గా ఆగిపోయారు. ఐతే జబర్దస్త్ నుంచి ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . "ఆ రోజు జబర్దస్త్ కమెడియన్ అండ్ రైటర్ ఆటో రామ్ ప్రసాద్ ఇంటి గృహప్రవేశం జరిగింది. ఐతే రెండు రోజుల తర్వాత స్కిట్స్ షూటింగ్ ఉంది.
ఇంతలో హీరో శ్రీకాంత్ ఫోన్ చేసి అమెరికాలో ప్రోగ్రాం ఉంది అక్కడకి ఆర్టిస్టులను తీసుకెళ్లి పెర్ఫార్మ్ చేస్తావా అని అడిగారు. ఐతే ఆ గృహప్రవేశానికి జబర్దస్త్ డైరెక్టర్స్ వచ్చారు అప్పుడు నేను వాళ్ళను అడిగాను అవకాశం ఇస్తే అమెరికా వెళ్లి అక్కడ స్కిట్స్ చేస్తాను అన్నా. ఎందుకంటే ఆల్రెడీ జబర్దస్త్ లో టు త్రి మంత్స్ కి స్కిట్స్ బ్యాకప్ ఉంటుంది. కాబట్టి అమెరికా వెళ్లి చేసి వచ్చాక జబర్దస్త్ లో జాయిన్ అవుతాను అని చెప్పాను. కాదు కుదరదు అన్నారు సరే ఆ ప్లేస్ లో బులెట్ భాస్కర్ వాళ్ళు వెళ్లారు. ఆ తర్వాత రోజు జబర్దస్త్ స్కిట్స్ రాసుకుని రిహార్సల్స్ చేసాం అన్నీ అయ్యాయి. రెండో రోజు షూటింగ్ కి బయలుదేరాలి ఇంతలో జబర్దస్త్ కి సంబంధించిన ఒక మేనేజర్ ఫోన్ చేసాడు. ఈరోజు మీ స్కిట్స్ ఆపేశారండి అని డైరెక్టర్ గారు చెప్పామన్నారు అని చెప్పాడు. కట్ చేస్తే పంచ్ ప్రసాద్, నాటీ నరేష్ ఎప్పటినుండో టీమ్ లీడర్ ఇవ్వండి అంటూ అడుగుతున్నారట .
వాళ్ళ కోసం నన్ను తీసేసారు అన్న విషయం నన్ను ఆపేసాక నా ప్లేస్ లో వచ్చినవాళ్ళను చూసాక అర్ధమయ్యింది. మేమున్నప్పుడు జబర్దస్త్ టిఆర్పి 14 , 15 ఉండేది ఇక ఇప్పుడు 3 ఉంది. నేను జబర్దస్త్ కోసం ఎంతో కష్టపడ్డాను. మా అమ్మ సిఓపిడి ప్రాబ్లమ్ తో చనిపోయారు. ఏడాదిలో నాలుగు సార్లు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేవారు. మా అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎప్పుడు పిలుస్తారో తెలీక నేను, కెవ్వు కార్తీక్, నత్తిగా మాట్లాడే దుర్గారావు వీళ్లంతా హాస్పిటల్ దగ్గరకు వచ్చి నాతో పాటు ఉంటూ స్కిట్స్ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అవకాశం వచ్చినా వెళ్తాను. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ ని కదా. " అంటూ చెప్పుకొచ్చాడు తిరుపతి ప్రకాష్.
Also Read