అమరదీప్ - అనుష్క అవుట్...స్టేజి మీద అనుష్క కన్నీళ్లు
on Mar 29, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గా సాగింది. ఈ సీజన్ లో ముందుగా ఢీ షోలో చేసిన జాను మెంటార్ గా వచ్చింది తొందరగానే ఎలిమినేట్ ఐపోయింది. ఆమె ప్లేస్ లోకి ప్రియాంక జైన్ వచ్చింది. తర్వాత మానస్ ఎలిమినేట్ అయ్యాడు ఆయన ప్లేస్ లోకి అమర్ దీప్ వచ్చాడు. ఇక ఈ వారం ఎపిసోడ్ లో అమర్ దీప్ ఎలిమినేట్ ఐపోయాడు. ఈ వారం ఎపిసోడ్ థీమ్ వచ్చి "డాన్స్ విత్ సీజన్ 1 డాన్స్ ఐకాన్స్". అంటే సీజన్ 1 కంటెస్టెంట్స్ వచ్చి ఈ సీజన్ వాళ్ళతో డాన్స్ చేశారు.
ఇక 6 లక్షల 14 వేల 502 ఓట్లతో టాప్ పొజిషన్ లో ప్రాకృతి - బర్కత్ ఉన్నారు..తర్వాత ప్రియాంక జైన్ - కాంచి షాకి 3 లక్షల 86 వేల 027 ఓట్లు వచ్చాయి.. ఇలా ఈ రెండు జోడీస్ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక మెంటార్ అమర్ దీప్ - అనుష్క 3 లక్షల 84 వేల ఓట్లతో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ షోకి కోర్ట్ మూవీ టీమ్ వచ్చింది. జాబిల్లి- చందు కలిసి డాన్స్ చేసారు. అలాగే జాబిల్లికి బర్కత్ ఎంతో బాగా నచ్చేయడంతో ఇద్దరూ హగ్ చేసుకున్నారు.. అలాగే ఇద్దరికీ ఒక కానవొకేషన్ చేసి పంపించాడు. ఎలిమినేట్ ఐపోయిన కంటెస్టెంట్ అనుష్క ఐతే బాగా ఏడ్చేసింది షోలో. ఇక అమరదీప్ ఆమెను ఊరడించాడు. ఇక్కడ ఎలిమినేట్ మాత్రమే అవుతున్నావు..డాన్స్ నీ నుంచి విడిపోవడంలేదు. బాధ ఉంటుంది కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు అమర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
