Biggboss 8 Telugu Review : టక్ టకా టక్ లో గెలిచిందెవరంటే.. ఓట్ అప్పీల్ చేసుకున్న ప్రేరణ!
on Dec 4, 2024
బిగ్ బాస్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉండగా.. ఆల్రెడీ అవినాష్ టికెట్ టూ ఫినాలే విన్ అయి ఫినాలే వీక్ కి వెళ్లిపోయాడు. ఇక నిన్న హౌస్ లో ఓట్ అప్పిల్ టాస్క్ జరిగింది. ఇందులో మూడు జంటలుగా పోటీ చెయ్యాలని బిగ్ బాస్ చెప్పాడు.
నేను నిఖిల్ తో ఆడుదామని అనుకుంటున్నానని ప్రేరణ చెప్పింది. విష్ణు, రోహిణి ఒక జంట, నబీల్ మొదట అవినాష్ అంటాడు. మిగిలింది గౌతమ్ ఒక్కడే..
నబీల్ తన నిర్ణయం మార్చుకుంటాడు. అవినాష్ నువ్వు నామినేషన్ లో లెవ్వు కదా గౌతమ్ నామినేషన్ లో ఉన్నాడు.. తనకి ఈ వారం గేమ్ ముఖ్యమని నబీల్ అంటాడు. దానికి అవినాష్ తప్పక సరే అంటాడు. ఆ తర్వాత మూడు జంటలకి ఎవరు ఎక్కువ టవర్ కడుతారో వాళ్లే విన్ అని బిగ్ బాస్ చెప్తాడు. అందులో ప్రేరణ, నిఖిల్ మరియు విష్ణు, రోహిణి లు గెలుస్తారు. నబీల్, గౌతమ్ లు టాస్క్ నుండి తప్పుకుంటారు.
బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్ ఇస్తాడు. ప్రేరణ నిఖిల్ తో పాటు విష్ణు రోహిణి లలో ఎవరో ఒకరు మాత్రమే ముందకు వెళ్తారు అనగా రోహిణి, విష్ణులు డిస్కషన్ చేసుకొని రోహిణిని సెలెక్ట్ చేస్తారు. రోహిణి ఆడుతుంది ఇక ఓటు అప్పిల్ టాస్క్ లో ప్రేరణ, నిఖిల్, రోహిణి లు కలిసి టక్ టాకా టక్ గేమ్ ఆడుతారు. ముగ్గురు బజర్ మోగేసరికి తమ టేబుల్ పై కార్డ్స్ ఉండకుండా చూసుకోవాలని బిగ్ బాస్ చెప్పగా.. అలా ఆ టాస్క్ లో ప్రేరణ గెలిచి ఓటు అప్పిల్ కి అవకాశం దక్కించుకుంది.
Also Read