Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!
on Feb 4, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.
ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన శివన్నారాయణ.. మేమ్ మరొకసారి జ్యోత్స్నకి సాంపిల్స్ ఇవ్వడానికి వచ్చామని చెప్తాడు. కారు ఆపేవరకు తెలియదు. నన్ను ఇక్కడికి తీసుకొని వస్తారని అనుకోలేదు.. ఇప్పుడేం చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్నని తీసుకొని దశరథ్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ టెస్ట్ చెయ్యమని చెప్తారు. అయ్యో రిపోర్ట్స్ అక్కడే ఉన్నాయని దీప అనగానే కార్తీక్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తాడు. జ్యోత్స్న చూసేలోపు ఆ రిపోర్ట్స్ తీసి పక్కన పెడుతుంది. దాంతో రిపోర్ట్స్ డాక్టర్ పక్కన పెట్టిందని దీపతో కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న మళ్ళీ టెస్ట్ ఎందుకు నా వైపు తప్పు జరిగింది అన్నారు కదా అని డాక్టర్ అంటుంది. అప్పుడే దశరథ్ కి రెస్టారెంట్ నుండి ఫోన్ వస్తుంటే జ్యోత్స్న దగ్గర శివన్నారాయణని ఉంచి దశరథ్ వెళ్ళిపోతాడు. శివన్నారాయణ పక్కన ఉండగా జ్యోత్స్నకి మళ్ళీ సాంపిల్స్ తీస్తారు.
మరొకవైపు కాశీని తీసుకొని శ్రీధర్ ఇంటికి వస్తుంది కాంచన. కాశీని చూసి స్వప్న చిరాకుగా ఫీల్ అవుతుంది. ఇద్దరిని కలపాలని కాంచన ట్రై చేస్తుంటే.. నాకు కాశీతో ఉండడం ఇష్టం లేదు విడాకులు ఇస్తానని స్వప్న చెప్పగానే అందరు షాక్ అవుతారు. మరొకవైపు దీప, కార్తీక్ ఇద్దరు ఒక దగ్గరికి వెళ్తారు. డాక్టర్ చెప్పింది గుర్తుచేసుకొని బాధపడుతారు. అప్పుడే అటుగా వెళ్తున్న దశరథ్ వాళ్ళిద్దరిని చూసి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఏమైంది దీప.. కడుపులో బిడ్డకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్పిందా.. ఎందుకు అలా ఉన్నారు.. ఎంత డబ్బు అయినా పర్వాలేదు .. బిడ్డ బాగుండాలి.. దీప కడుపులో ఉన్నది నా చెల్లి సంతోషం అని దశరథ్ బిడ్డ గురించి చెప్తుంటే దీప, కార్తీక్ ఇంకా బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



