వరలక్ష్మి వ్రతానికి సుమ కొన్న కొత్త చీర!
on Aug 18, 2023
వరలక్ష్మి వ్రతమంటే ఆడవాళ్ళకి ఎంత స్పెషలో అందరికి తెలిసిందే. అందులోను సెలబ్రిటీలు చేసే హాడావిడి అంతా ఇంతా కాదు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరూ గ్రాంఢ్ గా జరుపుకుంటారు. ఇప్పుడు అదే కోవలో సుమ చేరింది. ఈ వరలక్ష్మి వ్రతానికి తను షాపింగ్ చేసింది. దానికి సంబంధించిన ముచ్చట్లన్ని ఆ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది సుమ.
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ ' స్ట్రెస్ బస్టర్స్ ' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే తాజాగా సుమ.. ' వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తను చీరల షాపింగ్ చేస్తున్నట్టు చూపించింది. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా.. అది జనరల్ గా అమ్మాయి, అబ్బాయికి మధ్య కలిగేది కాదు..
ఆడవాళ్ళకి చీరలకి మధ్య జరిగేదంటూ స్టార్ట్ చేసింది సుమ. షాపింగ్ మాల్ లో చీరలు చూపించే ఆమె.. 'ఇవన్నీ సారీస్ అన్నమాట' అని అనగానే.. ఏంటి ఇవన్నీ సారీసా.. నేనింకా పంచెలనుకున్నా అని సుమ పంచ్ వేసింది. ఇలా సుమ తన షాపింగ్ లో.. సారీలతో పాటు పంచులను తీసుకొచ్చింది. కాగా యూట్యూబ్ లో తన ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
