'బ్లా..బ్లా..బ్లా' అంటున్న రౌడీ రోహిణి
on Sep 15, 2024
యూట్యూబ్ వచ్చాక చాలా మంది సెలబ్రిటీస్ ఐపోతున్నారు. అంటే బుల్లితెర కంటే కూడా ఈ యూట్యూబ్ మినీ తెరల మీద ఎక్కువ కంటెంట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి ఓన్ టాలెంట్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఒక స్టార్టప్స్ లా పనికొస్తున్నాయి. ఐతే ఇప్పుడు రౌడీ రోహిణి కూడా అదే వేలో వెళ్లాలని నిర్ణయించుకుంది. దాంతో ఒక అనౌన్స్మెంట్ చేసింది రోహిణి.
త్వరలో మీముందుకు కొత్తగా అంటూ కొన్ని రోజుల నుంచి రోహిణి కొన్ని సంకేతాలను ఫాన్స్ కి ఆడియన్స్ కి పంపిస్తూనే ఉంది. అదేంటో తెలీదు కానీ ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తే మంచి స్మార్ట్ డ్రెస్ పిక్స్ తో పాటు "బ్లా..బ్లా..బ్లా" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక పోస్టర్ అలాగే ఎదురుగా టేబుల్ మీద వాటర్ బోటిల్ కూడా పెట్టి ఉన్న ఒక రూమ్ లో రోహిణి కూర్చుని కనిపించింది. "సంథింగ్ కమింగ్ న్యూ" అంటూ పోస్ట్ చేసింది.
దాంతో నెటిజన్స్ మాత్రం కంగ్రాట్యులేషన్స్ అని పోస్ట్ చేస్తున్నారు. అలాగే రోహిణి అవుట్ ఫిట్స్ చూసి ఇంత స్లిమ్ గా ఉంటారని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఇంతకు ఈ షో దేనికి సంబంధించింది అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రోహిణి.
Also Read