ప్రేరణ అసలు రంగు బయట పడింది.. బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ వేసుకుని ఆడిందన్నమాట
on Dec 31, 2024
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో సీరియల్ యాక్టర్స్ అలాగే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక ఇందులో ప్రేరణ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఐతే ప్రేరణ బిగ్ బాస్ లో అన్ని రకాల పనులు చేసింది కానీ ఇంట్లో మాత్రం అలాంటివి ఏమీ చేయదట. ఆ విషయాన్ని స్వయంగా ఆమె భర్త శ్రీపద్ ఈ స్టేజి మీద చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ మాస్క్ తో ఆడిందా అంటూ శ్రీముఖి అసలు విషయాలను లీక్ చేసేసింది. ఇంతకు శ్రీపద్ ఎం చెప్పాడంటే " నేను ఉదయం 7 గంటలు లేస్తే ప్రేరణ లేచేది 11 కి లేస్తుంది. నిద్ర లేస్తుంది కానీ దుప్పట్లు దిండ్లు సర్దనే సర్దదు..అలా వెళ్ళిపోతుంది. ఎవరైనా లేచాక ఎం చేస్తారు స్నానం చేసి ఎవరి పనికి వాళ్ళు వెళ్తారు కానీ ప్రేరణ నాలుగు రోజులు అసలు స్నానమే చేయదు. ఈ రోజు షోకి వస్తుంది కాబట్టి చేసింది. అందుకే నేను కూడా ఈ షోకి వచ్చాను. మంచిగా డిన్నర్ ఏదైనా వండిపెడతావా అని అడుగుతాను.
8 గంటలకు ఆకలి వేస్తూ ఉంటుంది. ఇక తాను కిచెన్ లోకి వచ్చేసరికి ఏడున్నర ఐపోతుంది. ఇక అప్పుడు మొదలు పెడితే రాత్రి పది గంటలు దాటేస్తుంది డిన్నర్ ప్రిపరేషన్. ఒక్క రోజు మ్యాగీ చేసింది అంతే" అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు. ఇక అందరూ కూడా ప్రేరణతో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా అంటూ శ్రీపద్ కె ఓట్లేశారు. ఇక ఫైనల్ గా వాళ్ళ పెళ్లి ఎవరూ చూడలేదు కాబట్టి శ్రీముఖి ఇద్దరి చేత దండాలు మార్పించి లవ్ ప్రొపోజల్ చేసుకునే స్పేస్ ని క్రియేట్ చేసింది.
Also Read