Shekhar basha: శేఖర్ బాషాకి బాబు పుట్టాడు.. హౌస్ లో గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్!
on Sep 15, 2024
బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని రఫ్ఫాడించాడు నాగార్జున. హౌస్ లో వీకంతా ఎవరెవరు ఏం చేసారో చెప్తూ గట్టిగా క్లాస్ పీకాడు. అయితే వీటిల్లో ఓ గుడ్ న్యూస్ అండ్ సర్ ప్రైజ్ కూడా చెప్పాడు నాగార్జున. (Bigg Boss 8 Telugu)
ఇలాంటి సర్ ప్రైజ్ లు సర్వ సాధారణం.. ప్రతీ సీజన్లో ఇలాంటి ఒక ఎమోషన్ ఉండనే ఉంటుంది. గత సీజన్ 6 లో సింగర్ రేవంత్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు బయట తన వైఫ్ ఎలా ఉందోనంటూ రేవంత్ ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత తనకి పాప పుట్టిందంటూ బిగ్ బాస్ రేవంత్ కి గుడ్ న్యూస్ షేర్ చేసాడు. ఆ సీన్ మోస్ట్ హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. (Shekar Basha)
గత సీజన్లో కూడ అంబటి అర్జున్ కూడా అదే ఎమోషన్ క్యారీ చేస్తూ వచ్చాడు ప్రస్తుతం హౌస్ లో శేఖర్ బాషా కూడా అదే ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాడు. కానీ బయటపడడం లేదు. అతని భార్యకి డెలివరీ డేట్ సెప్టెంబర్ 14 కావడంతో శేఖర్ బాషా ప్రొద్దున నుండి నాగార్జున సర్ ఎప్పుడు వస్తారు.. ఏదైనా న్యూస్ చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నానంటు నాగార్జునతో శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. శేఖర్ కోసం బిగ్ బాస్ ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను. నీకు బాబు పుట్టాడని నాగార్జున చెప్పగానే శేఖర్ బాషా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సీజన్ లో ఇదే మోస్ట్ ఎమోషనల్ సీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అందరు శేఖర్ బాషాకి కంగ్రాట్స్ చెప్పారు. దాంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read