పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పల్లవి రామిశెట్టి!
on Nov 14, 2022
పల్లవి రామిశెట్టి పాపులర్ సీరియల్ యాక్టర్..ఇప్పుడు పల్లవి తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. "ఆడదే ఆధారం", "భార్యామణి", "మాటే మంత్రం" సీరియల్ నటి పల్లవి. తనకు పండంటి బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా తన ఫాన్స్ కి చెప్పింది. పుట్టిన బాబుకు సంబంధించి చిన్ని పాదాలను పిక్ తీసి ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. దీంతో ఫాన్స్, సహా నటీనటులు ఆమెకు విషెస్ చెప్తున్నారు.
ఇక పల్లవి మోడలింగ్ ద్వారా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భార్యామణి సీరియల్ కి బెస్ట్ టీవీ యాక్ట్రెస్ గా నంది అవార్డును అందుకుంది. ఆడదే ఆధారం సీరియల్ లో అమృత రోల్ లో, అత్తారింటికి దారేది సీరియల్ లో కృష్ణవేణిగా, మాటే మంత్రం సీరియల్ లో వసుంధరగా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యిది.
ఇక ఇప్పుడు పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్ లో జ్యోతి క్యారెక్టర్ లో చాలా ఇన్నోసెంట్ అమ్మాయిగా నటిస్తోంది. ఈమె 2019లో ఈమెకు దిలీప్ కుమార్ తో వివాహం జరిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
