Jayam serial: రౌడీని పంపించిన పారు.. హ్యాపీగా గంగ, రుద్ర!
on Dec 12, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -139 లో.. గంగ, రుద్ర నల్లపూసల కార్యక్రమం కోసం గంగ పుట్టింటికి వస్తారు. బస్తీ వాళ్ళందరు గంగ, రుద్రకి స్వాగతం పలుకుతారు. లక్ష్మీ హారతి ఇస్తుంది. ఇక గంగ ఫ్రెండ్స్ రుద్రని ఒక ఆట ఆడేసుకుంటారు. రుద్ర, గంగలని గుమ్మం దగ్గరే ఆపి.. పేర్లు చెప్పమని అంటారు. గంగ చెప్తుంది కానీ రుద్ర మాత్రం మొహమాటపడతాడు. రుద్ర, గంగ లోపలికి వస్తారు. ఆ స్వీట్ తిను.. ఈ స్వీట్ తిను అంటూ రుద్రని బస్తీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మీకెప్పుడు ఇదే పనేనా అని రుద్ర కోప్పడుతాడు.
అయిన వాళ్ళు అది జోక్ గా తీసుకుంటారు. మీరు బయటకు వెళ్ళండి అయన తింటాడని గంగ అనగానే అందరు వెళ్ళిపోతారు. నేను తిననని రుద్ర అనగానే నేను తింటాను.. ఎందుకు అంటే వాళ్ళు ఒక పూట భోజనం చెస్తే మరొకపూట చేయరు. అలాంటిది మీ కోసం ఇవన్నీ తెచ్చారు. మీరు తినలేదు అంటే ఫీల్ అవుతారు కదా అని గంగ అంటుంటే.. తన మాటలకి రుద్ర ఇంప్రెస్ అవుతాడు. మరొకవైపు రౌడీని గంగ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది పారు. అతను అక్కడ బాంబ్ పెడతాడు. ఆ తర్వాత గంగ నల్లపూసలు గుచ్చుతారు. గంగ మెడలో రుద్ర తాళి వేస్తాడు. అదంతా పారుకి రౌడీ వీడియో కాల్ లో చూపిస్తాడు. దాంతో పారు కోపంతో రగిలిపోతుంది.
ఆ తర్వాత రుద్ర, గంగకి అందరు శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. అందరు కలిసి రుద్ర, గంగ చేత బంతటా ఆడిస్తారు. ఇక బిందెలో ఉంగరం తీపిస్తారు. ఇలా అన్ని రుద్రతో చేపిస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



