Brahmamudi : మినిస్టర్ ఇంటికి వెళ్ళి తన పాపని ఇవ్వమని అడిగిన కావ్య!
on Jan 29, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -941 లో.... మినిస్టర్ తన ఫ్యామిలీకి శాంతి పూజ చేస్తుంటే అదే గుడికి కావ్య వస్తుంది. పాప బాగా ఏడవడంతో కావ్య అది గమనించి పాప దగ్గరికి వెళ్లి పాట పాడుతుంది. దాంతో పాప ఏడుపు ఆపుతుంది.. చాలా థాంక్స్ అండి మీరు ఎవరో గాని పాప మీ వల్ల ఏడుపు ఆపింది అని తులసి అంటుంది. రుద్రాణి దగ్గరికి మినిస్టర్ వెళ్లి అదేంటి కావ్య ఇక్కడికి వచ్చిందని అంటాడు.
ఆ తర్వాత కావ్య తన గురించి చెప్తుంది. నా బిడ్డని హాస్పిటల్ లో ఎవరో చేంజ్ చేశారు. అప్పటి నుండి పాప కోసం వెతుకుతున్నానని కావ్య చెప్పాగానే అయ్యో పాపం ఎవరు మీ పాపని మార్చారని తులసి బాధపడుతుంది. అప్పుడే తన భర్తని పిలిచి ఏవండి పాపం కావ్య వాళ్ళ బిడ్డను ఎవరో మార్చారట వాళ్లెవరో కనుక్కోండి అని తులసి అనగానే అయ్యో అవునా అని మినిస్టర్ ఏం తెలియనట్లే మాట్లాడతాడు. ఆ తర్వాత తులసి చీరపై ఏదో పడితే పాపని ఒకసారి ఎత్తుకొండి అని కావ్యకి ఇస్తుంది తులసి. దాంతో కావ్య పాపని ఎత్తుకుంటుంది. తనకి పాప స్పర్శ తెలిసిపోతుంది. అప్పుడే మినిస్టర్ తన చేతిలో నుండి పాపని లాక్కొని వెళ్లిపోతాడు. అప్పుడే కావ్య పాప చేతికి ఉన్న పుట్టుమచ్చ చూస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. నా పాప అంటూ వాళ్ళ వెంట కావ్య పరిగెడుతుంటే రుద్రాణి ఆపి కావ్య ఇక్కడ ఉన్నావేంటని మాటల్లో పెడుతుంది.
ఆ తర్వాత కావ్యకి డాక్టర్ ఫోన్ చేసి లిస్ట్ తెప్పించాను. మీరు హాస్పిటల్ కీ రండి అని చెప్తుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి రేఖ జ్యూస్ తీసుకొని వెళ్తుంది. అప్పుడే రుద్రాణి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. కావ్య వాళ్ళ వెంట పిచ్చి దానిలాగ పరిగెడుతుంది.. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చెయ్.. అప్పుడు కావ్య నిజంగానే పిచ్చి పట్టిందని అంటారని రేఖతో చెప్తుంది రుద్రాణి. ఆ తర్వాత కావ్య హాస్పిటల్ కి వెళ్తుంది. కావ్య తనకి గుళ్లో పాప కన్పించిన విషయం డాక్టర్ కి చెప్తుంది. ఇంకుబెటర్ లో ఎవరిని పెట్టారని కావ్య అడుగగా తులసి గారి పాపని , నీ పాపని అని డాక్టర్ అనగానే వాళ్లే పాపని మార్చరని కావ్య చెప్తుంది. తులసి కేసు చూసింది డాక్టర్ చక్రవర్తి కానీ అతను రావడం లేదని డాక్టర్ చెప్తుంది. తరువాయి భాగంలో కావ్య ఏకంగా మినిస్టర్ దగ్గరికి వెళ్లి పాప గురించి అడుగుతుంది. నా పాపని నాకు ఇవ్వండి కావ్య అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



