వాటిని బాధపెట్టడానికి ఎలా మనసొప్పుతుంది ఎవరికైనా ? రష్మీ సూటి ప్రశ్న
on Dec 9, 2022
.webp)
రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు నటన, ఐతే ఎంజాయ్మెంట్ వీటితో పాటు ఆమెకు మూగ జీవాలు అంటే చాలా ఇష్టం..అందులోనూ కుక్కలంటే మరీ ఇష్టం. ఈమె ప్రస్తుతం "ఎక్స్ ట్రా జబర్దస్త్ " షోకి , ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి యాంకర్ గా పనిచేస్తోంది. రష్మీ అంటే కేవలం యాంకర్ మాత్రమే కాదు.. మానవతావాది కూడా అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. రష్మీ కష్టాల్లో ఉన్న ఎంతో మందికి హెల్ప్ చేసింది అంతేకాదు కరోనా టైంలో స్వయంగా తానే ఫుడ్ తీసుకెళ్లి రోడ్డు మీద ఉండే మూగజీవాలకు పెట్టేది.
ఐతే ఇప్పుడు రష్మీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ నెటిజన్స్ ని బాగా ఆకర్షిస్తోంది. చాలా క్యూట్ గా కూడా ఉంది. ఒక పిల్లాడు స్కూల్ బస్సు నుంచి దిగి పరిగెత్తుకుని వస్తుంటే ఆ కుర్రాడు పెంచుకునే కుక్కపిల్ల రోడ్డు మీద ఆ పిల్లాడి కోసం వెయిట్ చేసి అతను వచ్చేసరికి ఎలా పరిగెత్తిందో ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఇక దీనికి కాప్షన్ గా " ఆ కుక్కపిల్లలకు ఉన్నంత స్వచ్ఛమైన మనసు మనకు అసలు ఉండనే ఉండదు. మరి అలాంటి వాటిని బాధపెట్టడానికి ఎలా మనసొప్పుతుంది ఎవరికైనా ?" అని ప్రశ్నించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



