అందుకే రాంప్రసాద్ తలకు మాస్క్ పెట్టుకుని నటిస్తున్నాడు!
on Dec 28, 2022
.webp)
జబర్దస్త్ కమెడియన్స్ లో రామ్ ప్రసాద్ కి రైటర్ గా, కమెడియన్ గా మంచి పేరుంది. ఆటో పంచ్ డైలాగ్స్ కి రామ్ ప్రసాద్ ఫేమస్. అందుకే ఆయన్ని ఆటో రామ్ ప్రసాద్ అంటారు.
జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీ ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లేలా చేసింది. కొన్ని మూవీస్ లో రాంప్రసాద్ కమెడియన్ గా చేసాడు. అయితే రామ్ ప్రసాద్ ఇటీవలి స్కిట్స్ లో తలకు మాస్క్ పెట్టుకుని నటిస్తున్నారు. అసలు రామ్ ప్రసాద్ కి ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ అవుతున్నారు. ఆయన ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ ప్రసాద్ కి ఏమీ కాలేదు. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అందుకే తలకు మాస్క్ తో కనిపిస్తున్నారట.అంతే కానీ వేరే కారణాలు లేవట.
ఇక ఈ విషయం తెలిశాక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సుధీర్ టీమ్ లోంచి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో కొత్త కమెడియన్స్ ని తీసుకుని రామ్ ప్రసాద్ స్కిట్స్ చేశారు. మళ్ళీ కొంతకాలానికి గెటప్ శీను వచ్చి రామ్ ప్రసాద్ తో కలిసి స్కిట్స్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా రాలేదు. ఆయన త్వరలో వస్తున్నానని ప్రకటించారు కానీ, అది జరగలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



