Brahmamudi : అనుకున్నది చేసిన రుద్రాణి.. కావ్య తన పాపని కనిపెడుతుందా!
on Jan 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -934 లో..... కావ్య ప్రవర్తనతో డాక్టర్ కి విసుగు పుట్టి డిశ్చార్జ్ చేస్తుంది. అ విషయం రాజ్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. అదేంట్రా హాస్పిటల్ లోనే ఇంకా రెండు రోజులు ఉండాలి కదా అని ఇందిరాదేవి అనగానే కావ్య ప్రవర్తన చూసి రెండు రోజులు కాదు కదా రెండు గంటలు కూడా ఉంచుకోరని రాజ్ చెప్తాడు. కావ్యకి పాపని ఇస్తుంది నర్సు. నా పాప కాదు నేను తీసుకోనని కావ్య అనగానే మీరు డిశ్చార్జ్ అవుతున్నారు.. మీకు పాపని ఇవ్వడం మా బాధ్యత అని నర్సు అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి పాపని తీసుకుంటాడు. మళ్ళీ కావ్య అలానే వాదిస్తుంది. నేను ఇంటికి రానని అంటుంది. నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టే అని రాజ్ అనగానే కావ్య ఏం చెయ్యలేక హాస్పిటల్ నుండి బయల్దేరుతుంది.
ఒక పక్క మినిస్టర్ తన భార్య బిడ్డతో..మరో పక్క కావ్య, రాజ్ హాస్పిటల్ నుండి బయలుదేర్తారు. అక్కడే ఉన్న రుద్రాణి, రాహుల్, రేఖ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అయిన అర్థం అయిందా మీ అమ్మ గురించి అని రుద్రాణి అనగానే మమ్మీ నువ్వు గ్రేట్ జీవితాలే తారుమారు చేసావని రాహుల్ అంటాడు. రాజ్ బావ నా సొంతం కావాలని రేఖ చెప్తుంది. రాజ్ ని నీ సొంతం చేసి రాహుల్ ని ఆ ఆస్తులకి అధిపతిని చేస్తానని రుద్రాణి అంటుంది. మరొకవైపు ఇంటికి వచ్చాక అందరు కావ్యకి నచ్చజెప్పాలని చూస్తారు. కానీ కావ్య ఎవరి మాట వినదు. రాజ్.. నువ్వు అయిన కావ్యకి చెప్పమని స్వప్న అంటుంది. కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి నచ్చజెప్పాలని ట్రై చేస్తాడు.
నా కూతురు కాదని కావ్య చెప్తుంది. అసలు ఎలా నువ్వు పాప మారిందటున్నావని రాజ్ అడుగుతాడు. నేను కన్నతల్లిని నాకు స్పర్శ తెలియదా అని కావ్య అనగానే ప్రాక్టికల్ గా థింక్ చెయ్ అని రాజ్ అంటాడు. నా కూతురికి పుట్టుమచ్చ ఉంది. ఈ పాపకు లేదు. ఇది ప్రాక్టికల్ ఏ కదా అని కావ్య అంటుంది. నువ్వు తప్ప ఆ పుట్టుమచ్చ ఎవరు చూడలేదని రాజ్ అంటాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డ మారిపోయిందని కావ్య అంటుంది. మరొకవైపు పాపని చూస్తూ తులసి మురిసిపోతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



