Brahmamudi : తన పాప కాదనే నిజం కావ్యకి తెలుస్తుందా.. మినిస్టర్ ఏం చేయనున్నాడు!
on Jan 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -936 లో.... కావ్య ఎప్పుడు అలా మాట్లాడలేదు. అలా అంటుందంటే తన మాటల్లో నిజం ఉందని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నాకు కావ్య మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది కానీ ఒక్క మాటతో మనం సాక్ష్యం చూపించలేం కదా ఆధారాలు కావాలని రాజ్ అంటాడు. మనం ముందు DNA టెస్ట్ చేయించాలని అప్పు చెప్తుంది. ఒకవేళ కోర్ట్ లో కేసు వేసినా వాళ్ళు కూడా ఇదే చెప్తారు. మనం ముందే చేపిద్దామని అప్పు అనగానే రాజ్ సరే అంటాడు. అదే విషయం కావ్యకి చెప్పాడానికి రాజ్ వెళ్తాడు.
కావ్య నీ మాటల్లో నిజం ఉందని నేను నమ్ముతున్నాను కానీ అవి సాక్ష్యం కాదు కదా అందుకే DNA చెప్పిద్దాం.. అప్పడే ఈ పాప నీకు పుట్టిన బిడ్డో లేదో తెలుస్తుందని రాజ్ అంటాడు. నా మాట మీద నమ్మకం ఉంటే మీరు ఈ మాట అనరు అని కావ్య అంటుంది. నీ మాట మీద నమకం ఉంది కాబట్టే ఈ ఆలోచన చేసానని రాజ్ అంటాడు. సరే మీరు అన్న దానికి ఒప్పుకుంటున్నానని కావ్య అంటుంది. మరొకవైపు మినిస్టర్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. కావ్య మాటలు నమ్మి ఇంట్లో వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం అయ్యారట రిపోర్ట్స్ గాని వస్తే బిడ్డ తన బిడ్డ కాదని తెలిస్తే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఇక్కడ వరకు వస్తారు. ఏం చేస్తారో మీ ఇష్టమని మినిస్టర్ తో రుద్రాణి అనగానే అలా జరగనివ్వనని మినిస్టర్ అంటాడు.
ఆ తర్వాత కావ్యతో రాజ్ మాట్లాడుతాడు. ఒకవేళ రిపోర్ట్స్ లో ఈ బిడ్డ మన బిడ్డ కాదని తెలిస్తే నీతో పాటు మన బిడ్డని నేను వెతుకుతాను. బిడ్డ దొరికే వరకు పోరాడతాను. రిపోర్ట్స్ లో ఈ బిడ్డ మన బిడ్డ అని తెలిస్తే నువ్వు మన బిడ్డ కాదు అన్న అపోహ తొలగించాలి. నేను మెచ్చిన నా భార్యగా బిడ్డకి తల్లిగా ఉండాలని రాజ్ అంటాడు. రిపోర్ట్స్ నేను అనుకున్నట్లు గానే వస్తాయని కావ్య అంటుంది. మరొకవైపు కావ్య బిడ్డ విషయంలో అలా చేస్తుంది.. దానికే ఎందుకు ఇలా జరుగుతుందని సుభాష్ తో అపర్ణ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



