Brahmamudi : రాజ్ గదిలో దొంగబంగారం.. అరెస్టు చేసిన పోలీసులు!
on Jan 8, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -924 లో..... రుద్రాణికి పసరు మందు ఇచ్చిన అతన్ని కనకం తీసుకొని వస్తుంది. అయినా కనకం చెప్పేది అంతా అబద్దమని రుద్రాణి అంటుంటే పసరు మందు ఇచ్చే అతన్ని సుభాష్ కొడుతూ అసలు నిజం చెప్పమని అంటాడు. దాంతో అతను భయపడతడు. కనకం గారు చెప్పేది నిజం అని అతను అనగానే అందరు షాక్ అవుతారు. ఎందుకు ఇలా చేసావ్ రుద్రాణి.. నీకు ఇంట్లో మంచి స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావా అని రుద్రాణిపై అపర్ణ విరుచుకుపడుతుంది.
అందరు ఒక్కొక్క మాట రుద్రాణిని తిడుతుంటారు. నన్ను క్షమించండి.. సిగ్గుతో తలదించుకుంటున్నానని రాజ్, కావ్యలతో రుద్రాణి అంటుంది. ఆ మాట ఎలా అనగలుగుతున్నావే అని ఇందిరాదేవి అంటుంది. రాహుల్, రేఖ కూడా రుద్రాణి చేసిన దాన్ని తప్పుపడుతారు. రుద్రాణిని మెడ పట్టుకొని ఇందిరాదేవి బయటకు గెంటేస్తుంది. అ తర్వాత కావ్య కళ్ళు తిరిగిపడిపోతే వెంటనే డాక్టర్ ని రప్పిస్తారు. కావ్యని డాక్టర్ చెక్ చేసి పర్లేదు బాగానే ఉందని చెప్తుంది. మా మమ్మీ చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నానని రాహుల్ అనగానే నీకు తెలియకుండా ఏది జరగదులే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు.. మా అత్త తప్పు చేస్తే పాపం రాహుల్ ని ఎందుకు అంటున్నారని స్వప్న అడుగుతుంది.
అ తర్వాత బయటకు వెళ్లిన రుద్రాణిని రాహుల్, రేఖ కలుస్తారు. మమ్మీ మాపై కోపంగా ఉందా అని అడుగుతారు. లేదురా మీరు నాకు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా గెంటేసేవారు. మీరు అక్కడే ఉండి ఆ కుటుంబాన్ని ఎలా నాశనం చెయ్యాలో ట్రై చెయ్యండి. నేను బయట ఉండి ప్లాన్ చేస్తానని రుద్రాణి తన కొడుకు, కూతురికి సలహా ఇస్తుంది. తరువాయి భాగంలో రాహుల్ చేసిన ప్లాన్ లో భాగంగా రాజ్ దొంగ బంగారం సప్లై చేస్తున్నాడని పోలీసులు రాజ్ దగ్గరికి వస్తారు. రాజ్ గదిలో దొంగ బంగారం దొరుకుతుంది. దాంతో రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



