Brahmamudi: అప్పు ఇన్వెస్టిగేషన్ కి ఓకే చెప్పేసిన ప్రకాష్.. దొంగని పట్టుకున్న కావ్య!
on Dec 18, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -906 లో..... రాజ్ దగ్గరికి స్వప్న వచ్చి మాట్లాడుతుంది. నీ వల్లే ఇదంతా.. రాహుల్ లో మార్పు రాహుల్ కి కంపెనీ పెట్టించడం.. తనకి అవార్డు రావడం ఇదంతా చాలా ప్రౌడ్ గా ఉందని స్వప్న అంటుంది. చూసారా మా అక్క ఎంత సంతోషంగా ఉందో.. ఇప్పుడు రాహుల్ చీట్ చేసాడని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని కావ్య అనగానే రాజ్ సైలెంట్ గా ఉంటాడు.
మరొకవైపు అప్పు ఇంటికి వస్తుంది. ప్రకాష్ ని చూసి ఏదో కవర్ చెయ్యాలని చూస్తుంది. అంత అవసరం లేదు నాన్నకి మొత్తం తెలిసిందని కళ్యాణ్ అంటాడు. ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు.. ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా అని ప్రకాష్ అనగానే అప్పు ఒక కేసు డీల్ చేస్తుంది. అది కంపల్సరిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని కళ్యాణ్ చెప్తాడు. దాంతో ప్రకాష్ కన్విన్స్ అవుతాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఇంటికి వస్తారు. జరిగింది మొత్తం అపర్ణ, ఇందిరాదేవికి చెప్తారు. అంత చీట్ చేసిన వాడి సంగతి చెప్పకుండా సైలెంట్ గా ఉంటారా అని ఇందిరాదేవి అనగానే కోపం వచ్చింది కానీ ఏం చెయ్యలేని సిచువేషన్ అని రాజ్ అంటాడు. ఒక్క నెల టైం ఇవ్వండి మన కంపెనీ మళ్ళీ ముందుకు వస్తుందని రాజ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు.. మన డిజైన్స్ ఎలా బయటకు వెళ్లాయి.. ఎవరి మీద అయినా డౌట్ ఉంటే చెప్పండి అని కావ్య అంటుంది. ఈ డిజైన్ చాలా ఇంపార్టెంట్ వీటిని బయటికి లీక్ చెయ్యొద్దని కావాలనే ఎంప్లాయిస్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య క్యాబిన్ కి వెళ్ళగానే.. నువ్వు ఎప్పుడు డిజైన్స్ వేసావ్ అని రాజ్ అడుగుతాడు. నాకు టీ తాగాలని ఉందని రాజ్ ని కావ్య పక్కకి తీసుకొని వెళ్తుంది. రాహుల్ మనిషి కావ్య క్యాబిన్ కి వెళ్లి డిజైన్స్ తీసుకుంటాడు. అవి డిజైన్స్ కాదు ఎవరు డిజైన్స్ లీక్ చేసారో కనిపెట్టాడని కావ్య ప్లాన్. అతని క్యాబిన్ లోకి వెళ్లగానే రాజ్, కావ్య వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



