చావు గురించి ఆర్జీవీ ఎనాలిసిస్ మాములుగా లేదు భయ్యో
on Dec 6, 2024
రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సెన్సేషన్ గా ఉంటుంది. ఇక తన చావు గురించే మాట్లాడితే ఎలా ఉంటుంది. దానికి కూడా సరైన ప్లాన్ చేసుకునే పెట్టుకున్నాడట రాము. ఒక ఇంటర్వ్యూలో చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "చావు అనేది అందరికీ సహజం. కానీ నా ఎండ్ స్టేజి ఎలా ఉంటుంది అంటే నేను నా పనులు చేసుకోలేని రోజు నేను బతికుండి కూడా ఏమీ చేసుకోలేని రోజు వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. నా ఐడియాస్ నాకు ఉన్నాయి.
మోస్ట్ పెయిన్ ఫుల్ డెత్ ఏంటి అనే రీసెర్చ్ చేశా. ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు బతకడం ఎందుకసలు. బతుక్కి అర్ధం లేదు కదా. ఊరికే చెట్టు లాగ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం అంతే కదా. జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతే బతకడం వేస్ట్.. చావు అనేది వేరే వాళ్లకు ఎక్స్ట్రీమ్ ఐనప్పుడు నాకు అది చాలా ఈజీగా ఉండొచ్చు. నేను ఈజీగా పెయిన్లెస్ గా చనిపోయే విధానాలను కూడా రీసెర్చ్ చేస్తున్నా. ఏ పని చేస్తున్నా స్మూత్ గా ఈజీగా ఐపోవాలి అని ఎలా అనుకుంటామో చావులో కూడా అలాగే స్మూత్ గా ఈజీగా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ ఎంతో కొంత పెయిన్ ఐతే ఉంటుంది. ఆ కొంత పెయిన్ కూడా స్మూత్ గా చేసుకోవాలి అంటే ఎంతో కొంతం మన జ్ఞానాన్ని, థింకింగ్ ని యూజ్ చేసి చనిపోవచ్చు. ఈ చావు అనేది ఏజ్ తో సంబంధం లేకుండా మనం మన పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు. అలాగే నాకు అవయవ దానం మీద పెద్దగా ఇంటరెస్ట్ లేదు అవయవ దానం కూడా చేయను. ఎందుకు ..ఇంకో లైఫ్ అనేది ఉండదు కదా. కళ్ళు దానం చేశాననుకోండి దేవుడు ఇంకో జన్మ ఇస్తే ఒకవేళ నీ కళ్ళు దానం చేసావ్ కదా గత జన్మలో...కాబట్టి ఈ జన్మలో కళ్ళు లేకుండా పుట్టు అని చెప్పాడే అనుకోండి నేను డిజప్పోయింట్ అవుతాను. అందుకే నేను ఎవరికీ అవయవ దానం చేయను. నేను నా కోసమే బతుకుతా..అన్ని అవయవాలు నాతో పాటే తీసుకెళ్ళిపోతా. నేను ఇంతవరకు ఏదీ డొనేట్ చేయలేదు. ఎవరైనా డబ్బులు కావాలని అని అడిగినా అప్పటికి వాళ్ళ మీద నా ఫీలింగ్ ని బట్టి ఇస్తాను లేదంటే లేదు. " అంటూ వెరైటీగా అనుకున్నది చెప్పుకొచ్చాడు రాము.
Also Read