రష్మిక కంగ్రాట్యులేషన్స్ అని టెక్స్ట్ మెసేజ్ చేసింది...సోనియా నంబర్ ని బ్లాక్ లో పెట్టాను!
on Dec 18, 2024
స్టార్ మా సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'తో పాపులర్ అయ్యింది ప్రేరణ కంభం. అందులో ఆమె కృష్ణ రోల్ చేశారు. నాలుగేళ్లు ఆ సీరియల్ నడిచింది. ఆ తరువాత ఆమె బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి టాప్ 5 లో నిలిచింది. ఇక బిగ్ బాస్ ఐపోయి వచ్చాక చాలా విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. "కిర్రాక్ సీత మొదట్లో నన్ను ట్రిగర్ చేయాలని చూసింది కానీ ఆమె ట్రిగర్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఎందుకు అలా వెళ్లిపోయిందో నాకు తెలీదు. ఆమె నన్ను అనాలని చూసింది కానీ నేను లైట్ తీసుకున్నా. ఇక సోనియా ఫస్ట్ నుంచి నన్నే టార్గెట్ చేస్తూ వచ్చింది. అలాగే రెండో సారి వచ్చినప్పుడు కూడా టార్గెట్ చేసింది.
నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె ముందు నుంచి చేసిన దానికి, రెండో సారి వచ్చి చేసిన దానికి లాస్ట్ లో ఆమె ఫోన్ నంబర్ ని బ్లాక్ లో పెట్టాను. రెండింటికి కలిపి అదే నా ఆన్సర్..నాకు చాలా బాధగా అనిపించింది ఆమె చేసిన కామెంట్స్..ఎందుకంటే నేను అలా బిహేవ్ చేయడం లేదు. నా మీదే ఎందుకు అంత ఫోకస్, నా మీదే ఎందుకు అంత కోపం అనేది నాకు తెలీదు. నేను చాలా నిజాయితీగా ఉన్నాను. నాకు నచ్చినవి చెప్పాను. నచ్చనివి వదిలేసాను. ఆమెకు నచ్చింది ఆమె చెప్పింది. అలా జరిగిపోయింది అంతే..నేను బిగ్ బాస్ కి వచ్చిన విషయం నా ఫ్రెండ్ రష్మికకి చెప్పాను..బయటకు వచ్చాను కొన్ని రోజులు ఆగాక కలుస్తాను..విన్నర్ ఐనందుకు కంగ్రాట్యులేషన్స్ అని టెక్స్ట్ మెసేజ్ పంపింది. కొంచెం రెస్ట్ తీసుకుని ఆరాంగా వెళ్లి పుష్ప మూవీ చూస్తాను." అని చెప్పింది ప్రేరణ.
Also Read