ఫీలైన ప్రదీప్ : గురువు గారు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేసావుగా
on Apr 1, 2025
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రొమోషన్స్ ని బాగా చేస్తున్నాడు ప్రదీప్ . ఇక రీసెంట్ గా "అనగనగా ఈ ఉగాదికి" షోకి వచ్చాడు. రాగానే హోస్ట్ నందు భరతనాట్యం స్టైల్ లో గురువు గారు ప్రదీప్ కి వంగి నమస్కరించాడు. దాంతో ప్రదీప్ కూడా షాకయ్యాడు. "మీరు గురువు గారు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేశారు" అంటూ ప్రదీప్ నవ్వుతూనే ఫీలయ్యాడు. దానికి హోస్ట్ నందు ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నాడు. "మిమ్మల్ని రీప్లేస్ చేయలేను కానీ మీ ప్లేస్ లో చేయడం చాలా ఆనందంగా ఉంది..ఇది ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా..మీరు సినిమాలు చేయాలి అలాగే త్వరగా మళ్ళీ మీ షోకి తిరిగి రావాలి అని ఎదురు చూస్తున్నా" అన్నాడు నందు. "అయ్యో మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకే ఏంటోలా ఉంది" అన్నాడు ప్రదీప్. ఇక రష్మీ ఐతే "పిందే పండయ్యింది" అంటూ ప్రదీప్ ని చూపించేసరికి ఒక్కసారిగా షాకై ఐనా "నీ తెలుగు వేరు మా అందరి తెలుగు వేరు కాబట్టి అనొచ్చు పర్లేదు" అంటూ రష్మీ డైలాగ్ ని కవర్ చేసేసాడు.
ప్రదీప్ ని రెండు రాష్ట్రాల అభిమానులు మిస్ అయ్యారు అంటూ ఆది చెప్పాడు. తర్వాత ఈ షోకి కాసేపు ప్రదీప్ యాంకరింగ్ చేసి ఇటు రీల్ జోడి టీమ్ నుంచి కావ్యతో అటు రియల్ జోడి టీమ్ నుంచి సోనియా సింగ్ తో కళ్ళకు గంతలు కట్టి మరీ ఉగాది పచ్చడి తయారు చేయించాడు ప్రదీప్. ఇదంతా చూసిన నందు కూడా ప్రదీప్ స్పాంటేనిటీకి ఫిదా ఐపోయాడు. "డార్లింగ్ చాలా రోజుల తర్వాత నువ్వు మా షోకి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసావ్. యూట్యూబ్ లో మీ డాన్స్ ని చూసి నేను చాలా సార్లు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈ విషయాన్ని నేను చాలా సార్లు ఆదితో షేర్ చేసుకున్నా కూడా. కానీ లైవ్ లో చూస్తున్నప్పుడు వచ్చే కిక్కుంది వేరే లెవెల్ లో ఉంది. నీ స్పాంటేనిటీకి, సమయస్ఫూర్తి సూపర్" అన్నాడు. అంతా మనవాళ్లే కాబట్టి స్పోర్టివ్ గా ఉంటారు కాబట్టి ఇంత ఫ్రీగా చేయగలిగాను చి చెప్పాడు ప్రదీప్.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
