పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ పెట్టడం హ్యాపీగా ఉంది...తమ్ముడు 9 సార్లు చూసా
on Apr 12, 2025
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ప్రదీప్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ టైటిల్ తోనే పవర్ స్టార్ పరిచయం అయ్యారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ప్రదీప్ మాచిరాజు అదే టైటిల్ తో మంచి స్టోరీతో ఆడియన్స్ ని పలకరించాడు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు. "పవన్ కళ్యాణ్ గారి డెబ్యూ ఫిలిం టైటిల్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు ఆ టైటిల్ సెట్ అవుతుంది అని మొదటి నుంచి అనుకున్నాం. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీకి కథకు సరిపడా టైటిల్ ఇది.
స్టోరీ ఆనుకున్న దగ్గర నుంచి కూడా ఈ టైటిల్ పెట్టాలి అనుకున్నాం. ఇంత మంచి టైటిల్ ఉన్నప్పుడు సినిమా కూడా అంత బాగుండాలని కోరుకున్నాం..అలాగే చేసాం. ప్రొడ్యూసర్, యాంకర్, రేడియో జాకీ, హీరో ఇవి వేటికవే ఇష్టం నాకు.. వీటిల్లో యాంకర్ గా నేను బాగా ఎంజాయ్ చేసాను. ఇక అనసూయ, రష్మీ, సుమ యాంకరింగ్ కి పదికి పది వేసేశాడు. ఆడియన్స్ దూరం కావడం బాధాకరమే..బిగ్ స్క్రీన్ మీద నవ్వించడానికి సిద్ధం అయ్యాక డేట్స్ అవీ సెట్ కాలేదు. నేను చేసిన చాలా షోస్ నాకు ఇష్టం. కానీ ఢీ షోని బాగా ఎంజాయ్ చేసాను. నాలో కొత్త ఎనెర్జీని సృష్టించింది ఆ షో. మా టీమ్ మేట్స్ గురించి మీ అందరికీ తెలుసు. అందరితో కలిసినప్పుడు పండగ వాతావరణం ఉంటుంది. అప్పుడప్పుడు పండగను మిస్ అవుతూ ఉంటాను. నాకు ఢీ జడ్జెస్ లో శేఖర్ మాష్టర్, జానీ మాష్టర్ బాగా క్లోజ్. ఇక నా క్రైమ్ పార్ట్నర్స్ ఎవరు అంటే రష్మీ, గెటప్ శీను, సుధీర్ చాల మంది ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు. తమ్ముడు సినిమా 9 సార్లు సంధ్య థియేటర్ లో చూసా. సినిమా చూడడం కోసం కాలేజ్ గోడలు దూకాను. టికెట్ తెంపేవాడి వాడి దగ్గర నుంచి ప్రొజెక్టర్ వేసే వాళ్ళ వరకు అందరూ నన్ను గుర్తుపట్టేవాళ్ళు. అంత రెగ్యులర్ గా సినిమా చూసేవాడిని. నాని నా డార్లింగ్ క్లాస్ మేట్. ఇక చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టి నా షోస్ చూస్తున్నాను అని చెప్పేవారు. నా తెలుగు ఆయనకు బాగా ఇష్టం అనేవారు. కరోనా టైములో మా పేరెంట్స్ కి బాగోకపోతే రోజూ ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. డాక్టర్స్ కూడా మాట్లాడేవారు. ఆ టైములో నేను ఒక్కడినే ఉండిపోయాను. నాకు కొండంత అండగా ఆంజనేయ స్వామిలా నా వెనక నిల్చున్నారు ఆయన." అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
