ప్రదీప్ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు
on Mar 31, 2025
ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద మోస్ట్ అమేజింగ్ యాంకర్ గా అమ్మాయిలకు మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలాకాలం పాటు యాంకరింగ్ చేసిన ప్రదీప్ రీసెంట్ గా ఒక మూవీ చేసాడు. ఐతే తనకు సంబందించిన ఎన్నో విషయాలను సుమతో జరిగిన చాట్ షోలో చెప్పుకొచ్చాడు. "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు నేను రెమ్యూనరేషన్ తీసుకోలేదు. నాకు ఇచ్చే డబ్బులను హోల్డ్ చేస్తే ఒక మంచి టెక్నీషియన్ ని తెచ్చుకోవచ్చు ఒక మంచి లొకేషన్ లో షూట్ చేసుకోవచ్చు అని అనుకున్నా. అలా లిమిటెడ్ బడ్జెట్ లో లిమిటెడ్ మెంబర్స్ తో ఈ మూవీ చేసాను.. ఇదొక చందమామ కథలా ఉంటుంది.
ఒక సాంగ్ ని లడక్ లో షూట్ చేసాం. త్వరలో ఆ సాంగ్ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సాంగ్ షూటింగ్ కోసమే తక్కువ మందిమి కలిసి డబ్బులు పోగేసుకుని షూట్ చేసి వచ్చాము ఆ సాంగ్ ని" అని చెప్పాడు ప్రదీప్. ఇక లవ్ మ్యాటర్ కి వచ్చేసరికి బ్రేకప్ అయ్యింది...బ్రేకప్పులే అయ్యాయి. అలాగే తారక్ తో ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తారక్ అన్న తనతో మలేసియా తీసుకెళ్లాడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే తారక్ వాళ్ళ అమ్మగారికి తన షో అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. అందుకే ఎప్పుడు సమయం కుదిరినా తారక్ అన్న షూటింగ్ కి వెళ్లి ఆయనతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు ప్రదీప్. 2014 నుంచి తమ మధ్య అద్భుతమైన బాండింగ్ ఉందని ఢీ షోలో తారక్ తన మోకాలి మీద కూర్చున్న పిక్ అంటే తారక్ ఫాన్స్ కి ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు ప్రదీప్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
