Podarillu: మూడు రోజుల్లో భూషణ్ తో పెళ్లి.. చక్రితో కలిసి మహా ఏం చేయనుంది?
on Dec 31, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -17 లో.. చక్రికి మాధవ ఫోన్ చేస్తాడు. ఇంకా ఎంతసేపురా అతన్ని వదిలెయ్యమంటావా అని మాధవ చెప్పగానే చక్రి టైమ్ చూసుకొని సరే వదిలెయ్యండి అని చెప్తాడు.
ఆ తర్వాత మహా దగ్గరికి చక్రి వెళ్తాడు. నువ్వు ఇలాగా కిడ్నాప్ లు చేస్తుంటావా అని అడుగుతుంది. లేదండి మీరు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నారని చేసాను.. నువ్వు ఇక్కడే ఉంటే మరి కిడ్నాప్ ఎవరు చేశారని మహా అడుగుతుంది. మా ఫ్యామిలీని మొత్తం ఇందులో ఇన్వాల్వ్ చేసానని చక్రి అనగానే అవునా చాలా థాంక్స్ అని మహా చెప్తుంది.
మరొకవైపు భూషణ్ ని రోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రతాప్ ఇంటికి వెళ్తాడు భూషణ్. అతడిని చూసి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో పెళ్లి ఆపాలని చూస్తున్నట్లనిపిస్తుంది. కరెక్ట్ పెళ్లి టైమ్ కి తీసుకొని పెళ్లి టైమ్ అవ్వగానే వదిలేసారని భూషణ్ చెప్తాడు.
ఆ తర్వాత చక్రికి మహా భోజనం తీసుకొని వచ్చి ఇస్తుంది. చక్రి భోజనం చేస్తుంటే మహా తన ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకుంటుంది. లోపల భూషణ్ వచ్చిన విషయం వాళ్లిద్దరికి తెలియదు.
ఎవరో పెళ్లి ఆపాలని చూస్తున్నారని అంటున్నావ్ కదా.. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు పెళ్లి మూడు రోజుల్లో జరిపిద్దామని ప్రతాప్ చెప్పగానే అందరు సరే అనుకుంటారు.
మరొకవైపు చక్రి తన ఫ్యామిలీ గురించి మహాకి గొప్పగా చెప్తాడు. మహా లోపలికి వెళ్తుంటే భూషణ్ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



