ఇంట్లో హీరో శ్రీకాంత్ పరిస్థితి...ఊహ ఏం చెప్పిందంటే!
on Oct 3, 2025

సిల్వర్ స్క్రీన్ మీద శ్రీకాంత్ ఎంత అందాల నటుడో ఊహ కూడా అంత కంటే అందాల నటి. ఆమె అందం ఒక పక్కన ఆమె పిల్లికళ్ళు మరో పక్కన వెరసి ఆమెకు ఒకప్పుడు బాయ్ ఫాన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. "ఆమె" మూవీ ఊహ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ కూడా. ఆమె ఎన్నో మూవీస్ లో నటించారు. ఆమె పేరుతో వచ్చిన "ఊహ" మూవీ కూడా అప్పట్లో హిట్ కొట్టింది. అలాగే ఆమె "అమ్మ నాగమ్మ" అనే మూవీలో ఆ తర్వాత ఊహా చిత్రం అనే మూవీస్ లో నటించారు. ఇక శ్రీకాంత్ కూడా ఎన్నో మూవీస్ లో నటించాడు. "పెళ్ళిసందడి, మహాత్మా, కోట బొమ్మాలి, శంకర్ దాదా ఎంబిబిఎస్" ఇలాంటి ఎన్నో మూవీస్ లో నటించారు. ఇక రీసెంట్ గా ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 ప్రోమోలో కనిపించరు. రాగానే శ్రీకాంత్ శ్రీముఖితో డాన్స్ చేసాడు.
"నాకే టెన్షన్ లేదు శ్రీముఖి నా పక్కన ఉందిగా అంతా తనే చూసుకుంటుంది" అన్నాడు. తర్వాత శ్రీకాంత్ కళ్ళకు గంతలు కట్టింది. కొంతమంది అమ్మాయిల్ని పెట్టింది. అలాగే హీరోయిన్ ఊహను స్టేజి మీదకు సైలెంట్ గా తీసుకొచ్చింది. "మీ అసలైన సౌందర్య లహరి ఎవరో టచ్ చేసి చెప్పాలి" అని శ్రీకాంత్ కి టాస్క్ ఇచ్చింది. "అది ఏదన్నా పొరపాటు జరిగితే ఇంటికి వెళ్ళాక చాలా ప్రాబ్లమ్ అవుతుంది" అన్నాడు. ఇక హోస్ట్ ప్రదీప్ చేతిని పట్టుకుని ఏయ్ ఏందయ్యా ఇది అన్నాడు శ్రీకాంత్ తర్వాత ఊహ చేతికున్న వ్వాచ్ పట్టుకుని పైకి లేపాడు. అలాగే ఆమెను హగ్ చేసుకున్నాడు. "ఒకవేళా ఆయన కనిపెట్టకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏమిటి" అంటూ శ్రీకాంత్ గురించి ఊహను అడిగింది శ్రీముఖి. "ఇంటికి వెళ్ళాక ఉండేది" అని చెప్పింది ఊహ. దాంతో శ్రీకాంత్ హెయిర్ సర్దుకున్నాడు. శ్రీముఖి గట్టిగా నవ్వింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



