నిఖిల్ ఓట్ అప్పీల్ లో సోనియాకి కౌంటర్..!
on Dec 7, 2024
బిగ్ బాస్ సీజన్-8 ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ వారమంతా ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. అందులో మొదట ప్రేరణ ఓట్ అప్పీల్ కు అర్హత సాధించగా, ఆ తర్వాత నబీల్, విష్ణుప్రియ చేసుకున్నారు.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్, నిఖిల్ ల మధ్య జరిగిన రంగు పడుద్ది టాస్క్ లో నిఖిల్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని గెలుచుకున్నాడు. ఇందులో నిఖిల్ ఏం మాట్లాడాడో ఓసారి చూసేద్దాం. హాయ్ అందరికీ నేను మీ నిఖిల్.. ముందుగా ఇన్ని వారాలు నాకు ఓట్లేసి ఈ హౌస్‌లో ఉంచిన మీకు థాంక్యూ.. ఇంకొక రెండు వారాలే ఉంది.. చాలా కష్టపడ్డాను.. మీరు కూడా నన్ను సేవ్ చేయానికి కష్టపడ్డారు.. నాకు విన్నర్ కావాలని చాలా కోరికగా ఉంది.. దానికి ఎంతవరకూ కష్టపడాలో అంతా నేను కష్టపడతాను.. ఇన్ని రోజులు నిఖిల్‌ని స్వీకరించినవాళ్లు మీరు.. ఈ ఒక్కసారి నిఖిల్‌ని గెలిపించండి.. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.. నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చి నిల్చోబెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను.. తెలుసో తెలీకో కొన్ని తప్పులు చేశాను.. దాన్ని మీరు క్షమించి నన్ను ఇక్కడి వరకూ తీసుకువచ్చారు.. థాంక్యూ.. అంటూ చెప్పాడు. ఇంకా రెండు వారాలే ఉంది.. మీ ఓటుతోనే నిఖిల్ గెలువగలుగుతాడు.
నిఖిల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు.. ఉంటాడంటూ మొన్న సోనియా అన్న మాటలకి కూడా నిఖిల్ ఇండైరెక్ట్ కౌంటర్లు వేశాడు. నేను ఒకేలా ఉంటాననే నమ్మకం నాకు ఉంది.. మీ ప్రేమ కూడా అలాగే ఉంటుందని నాకు గట్టి నమ్మకం ఉంది.. మీ ప్రేమ, సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి.. దాని వల్లే నిఖిల్ ఇక్కడ ఉన్నాడు.. ఈ షోను గెలవాలంటే మీ ఓటు నాకు కావాలి.. చిన్న చిన్న తప్పుల్ని బిడ్డగా చేశాను అనుకొని క్షమించండి.. అలానే మీ ఇంటి బిడ్డగా నేను కోరుకుంటున్నాను.. నాకు విన్నర్ కావాలని ఉంది.. ఈ నిఖిల్ ఎప్పుడూ మీ ఇంటి బిడ్డే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను గెలిపించాలంటూ నిఖిల్ కోరాడు
Also Read