ఓట్ అప్పీల్ లో గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్రంగా మారిన గొడవ.. అర్హత మాత్రం అతడికే!
on Dec 7, 2024
హౌస్‌లో గత వారం గోల్డెన్ టికెట్ గెలిచినవారికి ఈ వారం ఓ ప్రయోజనం కల్పించాడు బిగ్‌బాస్. లాస్ట్ వీకెండ్‌లో గోల్డెన్ టికెట్ వచ్చినందుకు గౌతమ్, నిఖిల్, రోహిణి మీకు ఇప్పుడు ఒక ప్రయోజనం లభిస్తుంది.. అదేంటంటే మీ ముగ్గురిలో నుంచి ఒకరికి మాత్రమే ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది.. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవడానికి మీకు 8 రాసి ఉన్న ఒక కేక్ ఇస్తాం.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి కేకును కట్ చేస్తూ 8న కింద పడకుండా చూడటం.. ఎవరు కేక్ కట్ చేస్తున్నప్పుడు 8 నెంబర్ కిందపడిపోతుందో వాళ్లు ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.. ఈ ఛాలెంజ్‌కి విష్ణుపియ సంచాలక్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
ఇక ఈ ఛాలెంజ్ మొదలుకాగానే గౌతమ్-నిఖిల్ చాలా బాగా ఆడారు. రోహిణి ఎక్కడ 8 పడిపోతుందో అన్నట్లు చాలా టెన్షన్ పడింది. ఇక చివరికి వచ్చేసరికి గౌతమ్ ఇంకా నైస్‌గా కేకును కట్ చేయడంతో ఆ తర్వాత వచ్చిన రోహిణి కట్ చేయబోయి 8 పడేసింది. దీంతో ఈ ఛాలెంజ్ నుంచి రోహిణి ఔట్ అయింది. దీంతో తదుపరి ఛాలెంజ్‌కి నిఖిల్-గౌతమ్ వెళ్లిపోయారు. తర్వాత నిఖిల్-గౌతమ్‌కి మరో ఫిజికల్ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. నిఖిల్-గౌతమ్.. మీ ఇద్దరిలో ఒకరికి ఓట్ అప్పీల్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఇస్తున్న చివరి ఛాలెంజ్ రంగుపడుద్ది.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయవల్సందల్లా మీ ప్రత్యర్థి టీ షర్ట్‌పైన ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవడం.. ఈ ఛాలెంజ్ మూడు రౌండ్స్‌లో జరుగుతుంది.. అన్ని రౌండ్స్ పూర్తయ్యేసరికి టీ షర్ట్ పైన తక్కువ రంగు ఉన్న సభ్యుడు ఈ ఛాలెంజ్‌ని గెలిచి ఆడియన్స్‌తో కనెక్ట్ అయి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశంతో పాటు తాము గెలిచే అవకాశాన్ని ఎక్కువ చేసుకున్నట్లే.. ప్రేరణ సంచాలక్ అంటూ అనౌన్స్ చేశాడు.
బజర్ మోగిన వెంటనే గౌతమ్-నిఖిల్ ఇద్దరూ ఒకరిపై ఒకరు కలర్స్ పూసుకున్నారు. అయితే మధ్యలో గౌతమ్ తన కలర్ తనే టీ షర్ట్‌పై రాసుకున్నడు. దీనిపై ప్రేరణ అభ్యంతరం చెప్పింది. దీంతో గౌతమ్ ఆపేశాడు. ఇక మొదటి రౌండ్ ముగిసేసరికి ఎక్కువ కలర్ నిఖిల షర్ట్‌పైనే ఉంది. కానీ ప్రేరణ తన కన్నడ బ్యాచ్ కాబట్టి నిఖిల్ విన్నర్ అంటూ చెప్పేసింది. ఇది చూసి మిగిలిన కంటెస్టెంట్ల్ ఏంటి అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. గౌతమ్ కూడా అదేంటి నాకు తక్కువ ఉంది కదా అంటూ గొడవ పడ్డాడు. దీంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా ఈ రౌండ్ టైగా ఇస్తున్నా.. అంటూ ప్రేరణ అంది. కానీ దీనికి బిగ్‌బాస్ ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక గట్టిగా చూస్తే కంపేరిటివ్‌లీ తక్కువ ఉన్నది గౌతమ్ దాంట్లో.. సో గౌతమ్ ఈ రౌండ్ విన్నర్ అంటూ ప్రేరణ చెప్పింది. రెండో రౌండ్‌లో ఇద్దరూ చాలా గట్టిగా ఆడారు. ముఖ్యంగా గౌతమ్ కాలు పట్టుకొని నిఖిల్ లాగిపడేశాడు. దీంతో గౌతమ్ కూడా ఫిజికల్ అయి రంగు రాయడానికి చాలా ట్రై చేశాడు. దీంతో గౌతమ్ నువ్వు కొడుతున్నావ్.. అంటూ రౌండ్ ముగిసిన వెంటనే నిఖిల్ ఆరోపించాడు. దీనికి నేను కావాలని కొట్టలేదు.. నువ్వు తోశావ్‌గా.. నువ్వు పడేసి కాలు లాక్కొని వెళ్లిపోయావ్.. అది ఏం కాదా.. నేను రాయబోతుంటే నీకు తగిలింది.. కావాలని కొట్టా అంటావా అంటూ గౌతమ్ కూడా రెయిజ్ అయ్యాడు. దీనికి నిఖిల్ నువ్వు అన్నీ అలానే చెబుతున్నావ్.. ఫస్ట్ రౌండ్‌లో ఎవరు చేసింది.. అడుగు సంచాలక్‌ని అంటూ నిఖిల్ అరిచాడు. ఈ వాదనలో గౌతమ్‌ని పక్కకెళ్లి కూసో బే.. అంటూ నిఖిల్ నోరుజారాడు. దీంతో బే అని ఎవడ్ని అంటున్నావ్.. మొన్న ఒక్క మాట అంటేనే సీరియస్ అయినవ్ కదా.. మరి బే అని ఎవడ్ని అంటున్నావ్.. అంటూ గౌతమ్ అడిగాడు. ముఖం మీద కొడతాడు మళ్లీ సారీ అంట.. అంటూ నిఖిల్ తిట్టుకున్నాడు.
ఇద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఫస్ట్ రౌండ్‌లో ఎవరు పడేసింది.. ఆడే విధానం తెలీదంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నీకు తెలీదు ఫస్ట్ నుంచి చూస్తున్నా.. ఎక్కువ తక్కువ మాట్లాడకంటూ గౌతమ్ రెయిజ్ చేయ్యాడు. మరి నువ్వేంది ముఖం మీద కొడుతున్నావంటూ నిఖిల్ అడుగగా.. నేను కావాలని కొడతానా అంటూ గౌతమ్ అడిగాడు. నువ్వు కొట్టినా కొడతావ్ అనిపించిందంటూ నిఖిల్ అన్నాడు. ఇంతలో ప్రేరణ మధ్యలో వస్తుంటే ఇది నా పర్సనల్.. నువ్వు మాట్లాడకు అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు. ఇక సెకండ్ రౌండ్ విన్నర్ నిఖిల్ అంటూ ప్రేరణ ప్రకటించింది. ఇక ఆ తర్వాత మూడో రౌండ్ లో నిఖిల్ గెలిచాడు. మూడు రౌండ్లలో రెండింట్లో గెలిచిన నిఖిల్ ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు.
Also Read