ENGLISH | TELUGU  
Home  » TV News

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

on Feb 11, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.

మరోవైపు చక్రి, మహా ఇద్దరు కలిసి గర్ల్స్ హాస్టల్ కోసం వెతుకుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, సర్టిఫికెట్లు  అంటూ అడుగుతారు. దాంతో చేసేదేమీ లేక మహా వెళ్ళిపోదామని అంటుంది. చక్రి  మహా కార్ లో వెళ్తుంటే  ఒక దగ్గర ఆపమంటుంది మహా. ఎందుకని చక్రి అడుగగా.. ఇప్పటికే మీరు నాకు చాలా చేశారు.. ఈ బంగారు గొలుసు అమ్మేసి డబ్బులు తీసుకురండి అని మహా అంటుంది. దాంతో వద్దని చెప్తాడు చక్రి. ఇక మహా వినకుండా బంగారం షాప్ లోకి వెళ్ళి ఆ బంగారు గొలుసు ఇచ్చి డబ్బు తీసుకొని కొంత డబ్బుని చక్రికి ఇచ్చి కొంత తన దగ్గర ఉంచుకుంటుంది. మరోవైపు మాధవ, నారాయణ, కేశవ ఇంట్లో ఉంటారు. అప్పుడే వారింటికి మాధవ వాళ్ళ మేనత్త, చిన్నాన్న వస్తారు. 

ఏంటి ఇలా వచ్చార్రా అని నారాయణ వాళ్ళిద్దరిని తిడతాడు. అసలు చక్రి రిసెప్షన్ జరుగుతుందని అనుకోలేదు.. అందుకే వదిలేసాం కానీ మమ్మల్ని అడగకుండా ఈ రిసెప్షన్ ఎలా చేశారని మేనత్త అనగానే నారాయణ ఎంట్రీ ఇచ్చి.. మీరు మనుషులేనా అంటూ తిడతాడు. మాధవ క్షమించండి అంటూ ఇద్దరికి సర్దిచెప్తాడు కానీ వాళ్ళు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తారు. దాంతో నారాయణ వాళ్ళ అన్నకి, నారాయణకి మధ్య గొడవ మొదలవుతుంది. అది కాస్తా ముదురుతుంది. దాంతో నారాయణ తోసేయ్యగా నారాయణ వాళ్ళ అన్న తలకి గాయం అవుతుంది. వెంటనే మాధవ వాళ్ళ మేనత్త, చిన్నాన్న కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తామని వెళ్తారు. మీ దిక్కున్న చోట చెప్పుకోమని నారాయణ అంటాడు. మరోవైపు మాధవ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.