ఈ ఆదికి పొగరు చాలా ఎక్కువైంది.. ఢీ షోలో లిప్ కిస్సులు!
on Mar 14, 2025
ఢీ జోడి షో లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆది కామెడీ మాములుగా లేదు. ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసాడు. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమోగా ఓన్ థీమ్ అని ఇచ్చారు. అంటే వాళ్ళ ఇష్టమైన కాన్సెప్ట్ మీద డాన్స్ చేయడం అన్నమాట. ఆది ఈ ఎపిసోడ్ కి పోలీస్ డ్రెస్ లో రాబోతున్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇక నందు ఐతే ఆదిని తెగ తిట్టుకున్నాడు. ఆదికి చాలా పొగరు ఎక్కువయిందని అనుకున్నాడు. ఆదికి ప్రేమించడానికి అసలు అమ్మాయే దొరక్కుండా చేస్తా అంటూ శపధం చేసాడు.
నందు మాటలు విన్న ఆది ఒక భారీ డైలాగ్ చెప్పాడు. 2 వేలు ఉంటే ఇందిరానగర్ కట్ట దగ్గర వెయిట్ చేస్తా, 5 వేలు ఉంటే కేపీహెచ్బీ దగ్గర వెయిట్ చేస్తా. ఎవరినీ ప్రేమించమని అడిగేది లేదు...ఎవరి దగ్గర చేయి చాచేది లేదు. సింగం సింగం అంటూ నటుడు సూర్య పాటను తెగ పాడేసాడు. నా కోరిక ఒకటే నందు "నా ఎదురుగా అమ్మాయి ఉన్నప్పుడు నా చేయి ఆ అమ్మాయి భుజం మీద ఉండాలి.. నా ముఖంలో చిరునవ్వు ఉండాలి... కెమెరాలు ఆఫ్ లో ఉండాలి "అంటూ ఒక డైలాగ్ చెప్పాడు.
ఆ తర్వాత సోనియా-సిద్దు దగ్గర వచ్చాడు. సోనియాని స్టేజి మీద పడుకోబెట్టి సిద్దుని గాల్లో హ్యాంగ్ చేసి ఊపుతూ వచ్చి బుగ్గ మీద, లిప్ కిస్ ఇచ్చేలా చేశారు. దాంతో స్టేజి మీద ఉన్న అందరూ చూసి నవ్వేశారు. ఇక డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఐతే మంచి హాట్ గా ఉన్నాయి.
ఇక ఈ షోని తిట్టే నెటిజన్స్ ఉన్నారు.. అలాగే పొగిడే నెటిజన్స్ ఉన్నారు. కొన్ని కామెంట్స్ ఐతే ఈ షోలో డాన్స్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ఢీ షోలో డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
