Biggboss 8 Telugu Promo: యష్మీ గౌడ ని గన్ తో కాల్చేసిన నాగార్జున!
on Sep 14, 2024
బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారమంతా హౌస్ లో ఎవరేం చేశారు? ఎవరేం తప్పు చేశారంటూ వాళ్లకి నాగార్జున క్లాస్ పీకే శనివారం రానే వచ్చింది. ఇక వీకెండ్ నాగార్జున కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకే ప్రోమో కోసం ఆందరు ఎదురుచూస్తుంటారు.
ఆ ప్రోమో రానే వచ్చింది. గత వారం నాగార్జున తన పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఎవరిని ఎక్కువగా అనకుండా చాలా సింపుల్ గా ఉన్నాడు. మునుపటి ఫైర్ లేదు. మరి హౌస్ లో కన్నడ బ్యాచ్ చేసే కన్నింగ్ చేష్టలకి ముగింపు ఇచ్చి వార్నింగ్ ఇస్తాడో లేదో అని ఇంటెన్స్ తో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే.... వచ్చీ రాగానే నాగార్జున గన్ పట్టుకొని వచ్చేశాడు. ఇక హౌస్ లోని ముగ్గురు చీఫ్ లని నిల్చోమని చెప్పాడు. ఎవరి క్లాన్ బాగా ఆడిందో చీఫ్ లనే చెప్పమని నాగార్జున అడుగగా.. ప్రేరణని రెడ్ లో ఉంచింది యష్మీ. ఎందుకంటే తను సంఛాలక్ గా ఫెయిల్ అయ్యిందంటూ యష్మీ చెప్పగా.. మరి నువ్వు సంఛాలక్ గా సీత, మణికంఠలు ఆడిన టాస్క్ లో ఫెయిల్ అవ్వలేదా అని నాగార్జున అడిగాడు. మణికంఠ అడిగానని చెప్తున్నాడు నువ్వు అడగలేదని అంటున్నావ్.. ఎవరు నిజం చెప్తున్నారో చూద్దామని సీసీటీవి ఫుటేజ్ చూపించగా.. అందులో నియర్ బై( దగ్గరగా) ఉందని తీసుకుందామని కిర్రాక్ సీత అనగా.. ఒకే అని యష్మీ ఒప్పుకుంది. ఆ తర్వాత మణికంఠ గెలవకుండా ఉండాలని , ఆ టీమ్ గెలవకూడదని అలా చేసానంటు యష్మీ చెప్పుకొచ్చింది. సంఛాలక్ గా యష్మీ ఫెయిల్ అంటు గన్ తో బోర్డ్ మీద ఉన్న యష్మీ ఫోటోని కాల్చేశాడు.
ఇక అభయ్, విష్ణుప్రియల మధ్య జరిగిన దాని గురించి కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టున్నాడు నాగార్జున. ఇక పృథ్వీ, నిఖిల్ ని స్ట్రాంగ్ ప్లేయర్స్ అని యష్మీ గ్రీన్ లో పెట్టమని అంది కానీ నాగార్జున.. ఇది నీ దృష్టిలో అసలేం జరిగిందో చూద్దామని అన్నాడు. మరి యష్మీ, ప్రేరణలకి ఈసారి గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూసారా మీరు. చూస్తే కామెంట్ చేయండి.
Also Read