ఒక్కరోజు అయిన కార్తీక్ కి భార్యగా ఉండాలని అనుకుంటున్నాను.!
on Jan 18, 2023
.webp)
'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ముగింపు అద్భుతంగా ఉంటుందని అఫీషియల్ గా కార్తీక్, దీపలు చెప్పారు. దీంతో ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మంగళవారం నాటి ఎపిసోడ్ -1564 లో.. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కార్తీక్, దీప ఇద్దరు కలిసి దీప పుట్టింటికి వస్తారు.
దీప రిపోర్ట్ ల గురించి అందరి డాక్టర్ లకు ఫోన్ చేసి కనుక్కుంటుంది సౌందర్య. అప్పుడే సౌందర్య దగ్గరికి మోనిత వచ్చి, ఫోన్ లాక్కుంటుంది. "మీ కొడుకే పెద్ద డాక్టర్ కదా.. అతని వల్లనే కాలేదు. ఇంక ఎవరి వాళ్ళ కాదు కానీ దీపని నేను ఒక్కదాన్నే కాపాడగలను. నన్ను నమ్మట్లేదా ఆంటీ" అని మోనిత అంటుంది. " విషం ఔషదం అవుతుందంటే ఎవరు నమ్ముతారు" అని సౌందర్య చెప్తుంది. "నేను చెప్పింది చేయండి. దీపని నేను బ్రతికిస్తాను. మీ కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు" అని అంటుంది మోనిత. "ఏంటీ అది?" అని సౌందర్య అడుగుతుంది. "నేను కార్తీక్ కి ఒక్క రోజు అయిన భార్యగా ఉండాలి. నాకు కార్తీక్ కి పెళ్లి చెయ్యండి. దానికి కార్తీక్ ని మీరే ఒప్పించాలి" అని అంటుంది మోనిత. "నాకు ముందే తెలుసే.. దీని వెనుక ఏదో ఉంటుందని, నా కోడలిని ఎలా బ్రతికించుకోవాలో నాకు బాగా తెలుసు" అని మోనితతో కోపంగా అంటుంది సౌందర్య. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది సౌందర్య.
కార్తీక్ దగ్గరికి సౌందర్య వచ్చి రిపోర్ట్ చూపించి అడుగుతుంది. "ఎందుకు రా మాకు ఇన్ని రోజులు చెప్పలేదు" అని సౌందర్య ఏడుస్తూ అడుగుతుంది. "దీప నాకు కావాలి మమ్మీ. దీప నా ప్రాణం. మమ్మీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దీపకి ఏం కానివ్వను. దీపను ఎలాగైనా కాపాడుకుంటాను" అని చెప్తూ ఏడుస్తాడు కార్తిక్. ఆ తర్వాత కాసేపటికి "ఇంతకీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు. ఈ రిపోర్ట్స్ ఎవరిచ్చారు?" అని సౌందర్యని అడుగుతాడు కార్తిక్. "మోనిత చెప్పింది" అని సౌందర్య జరిగినదంతా చెప్తుంది. "ఓహో.. నేను ఛీ కొడితే నీ దగ్గరికి వచ్చి చెప్పిందన్నమాట" అని అంటాడు కార్తిక్. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
సౌందర్య ఆంటీ తను చెప్పిన దానికి ఒప్పుకోలేదని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. అప్పుడే సౌందర్య ఫోన్ నుండి మోనితకి ఫోన్ చేస్తుంది హిమ. "ఆంటీ.. అసలు ఏం జరుగుతుంది" అని అడుగుతుంది. "వద్దులే హిమ..నువ్వు చిన్నపిల్లవి, విని తట్టుకోలేవు" అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మోనిత. "ఇక ఏం జరుగుతుందోననే టెన్షన్ తో రాత్రంతా హిమ ఆలోచిస్తుందని" అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



