Podharillu : కొత్త సిమ్ తీసుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేసిన మహా.. చక్రి ఏం చేయనున్నాడు!
on Feb 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -52 లో..... మహా ఇంటిబయట బట్టలు ఆరేస్తుంటే నారాయణ వాళ్ళ చెల్లెలు తాయారు తన దగ్గరికి వస్తుంది. ఏం పేరు అమ్మ అని తాయారు అడుగుతుంది. మహాలక్ష్మి అనగానే అవునా వెళ్లిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతుంది. వెళ్ళి హ్యాపీగా ఉన్నావనుకున్నా మళ్ళీ ఎందుకు వచ్చావ్.. ఈ ఇంట్లో అంతా నేరస్తులున్నారు.. జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరిస్తుంది తాయారు. అప్పుడే అక్కడికి నారాయణ వచ్చి రాయితో తాయారుని కొడతాడు. ఏంట్రా బండ సచ్చినోడా అని తాయారు తిడుతుంటే చంపలేదు సంతోషించు అంటు నారాయణ తిడతాడు ఇద్దరు కాసేపు తిట్టుకుంటారు.
ఆ తర్వాత మాధవ, కేశవల దగ్గరికి చక్రి వస్తాడు. జాబ్ పోయిందని చెప్తాడు. ఇప్పటిదాకా అన్న మీద పడి తిన్నావ్.. ఇకనైనా వెళ్ళిన దగ్గర బుద్దిగా ఉండు.. నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది.. కారుకూతలు కూయడాలు, అబద్ధాలు చెప్పడాలు, అన్నీ మానేసి బుద్ధిగా ఉండమని కేశవ అనగానే నిన్ను అడిగినారా అని చక్రి అంటాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే మహా బయట నుండి వస్తుంటుంది. ఇక ముగ్గురు గొడవ ఆపేస్తారు. ఏం జరిగినదని మహా అడుగగా ఏం లేదని చక్రి కవర్ చేస్తాడు. కాసేపటికి కన్నా, మహా ఇద్దరు కలిసి సెల్ ఫోన్ షాప్ కి వెళ్తారు. అక్కడ కన్నా ఆధార్ కార్డ్ తో కొత్తగా సిమ్ తీసుకుంటుంది మహా. ఇక ఇంటికొచ్చేసరికి నారాయణ అన్నం తినేసి ఎక్కడవి అక్కడే పడేయడం మహా చూసి చిరాకు పడుతుంది. మాకు ఇది మాములే అని కన్నా అంటాడు. ఇక మహా సిమ్ ఆక్టివేట్ అవుతుంది. దాంతో వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది మహా. నాన్న అనగానే ఎవరమ్మా నువ్వు నా కూతురు చచ్చిపోయిందమ్మా అని అతను కాల్ కట్ చేస్తాడు.
కాసేపటికి మహా వాళ్ళ అన్న అభి వస్తాడు. ఏం అయిందని అడుగగా మహా కాల్ చేసిందని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఏం అందని అభి అడుగగా అక్కడ తనకేం కష్టం వచ్చిందో కానీ చెప్పకుండానే ఈ మనిషి ఫోన్ కట్ చేశాడని వాళ్ళ అమ్మ అనగానే నన్ను కాదనుకొని వెళ్ళింది అనుభవించనివ్వు అని మహా వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహా గదిలో ఏడుస్తుంటుంది. తనని చూసి ఏం అయిందని చక్రి అడుగగా ఇల్లు గుర్తొచ్చిందని మహా అంటుంది. నా ఆధార్ కార్డ్, సర్టిఫికేట్లు పంపమని మా వదినని అడిగితే మా అన్నయ్య ఫోన్ తీసుకొని తిట్టాడని, నాకు ఎవరు లేరంటూ మహా అనగానే నీకు నేనున్నానంటూ చక్రి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



