శేఖర్ మాష్టర్ - అనసూయ ఎవరో తెలుసా...ఎనిమీస్
on Apr 8, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఈ వారం షో చాలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఒక్కో టాస్క్ లో ఒక్కోసారి ఒక్కొక్కరు గెలుస్తూ వచ్చారు. ఐతే ఇందులో హోస్ట్ శ్రీముఖి ఒక లైబ్రరీ కాన్సెప్ట్ ఇచ్చింది. అందులో లేడీస్ విన్ అయ్యారు. ఆ తర్వాత ఆ లైబ్రరీ సెటప్ ని తీసేసే ముందు అందరం కలిసి సరదాగా ఫ్లేమ్స్ ఆడదామా అనేసరికి ఓకే అన్నారు అంతా. ఐతే ఈ గేమ్ ని చిన్నప్పుడు ప్రతీ ఒక్కరం స్కూల్ లో, కాలేజ్ లో ఆడిన వాళ్ళమే. ఇక ఈ షోలో కొంతమందివి పేర్లు రాసి ఫ్లేమ్స్ ఆడింది శ్రీముఖి. ముందుగా డెబ్జాన్ - దిలీప్ ఇద్దరి పేర్లు రాసి ఫ్లేమ్స్ ఆడారు.
దాంతో వాళ్లకు మ్యారేజ్ అన్నది వచ్చింది. తర్వాత పృద్వి శెట్టి - ఐశ్వర్య పేర్లు రాసి చూస్తే అట్రాక్షన్ అని వచ్చింది. దాంతో ఐశ్వర్య ఒక సెకను పాటు పృద్వి కన్నార్పకుండా చూసి తర్వాత కళ్ళు మూసేసుకుంది. ఆ తర్వాత బబ్లు - శ్రీ సత్య పేర్లు రాసి ఫ్లేమ్స్ ఆడితే ఇంకేముంది మ్యారేజ్ అని వచ్చింది. దాంతో శ్రీసత్య బబ్లుకి ఆల్ ది బెస్ట్ చెప్పింది కామెడీగా. అనసూయ-యాదమ్మ రాజు పేర్లు రాసి చూస్తే ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉందని ఫ్లేమ్స్ లో వచ్చింది. దాంతో రాజు కోరిక మేరకు శ్రీముఖి అనసూయ - శేఖర్ మాష్టర్ పేర్లు రాసి చూస్తే ఇంకేముంది ఇద్దరూ ఎనిమీస్ అని వచ్చింది. ఆ మాటకు శేఖర్ మాష్టర్ రియాక్ట్ అయ్యారు. "నాకు సంబంధం లేదు. కాంపిటీషన్ వరకు వచ్చిందేమో అది" అంటూ చెప్పారు. ఇలా ఈ షోలో జరిగిన లైబ్రరీ అంటే ఈటింగ్ కాంపిటీషన్ లో ఖిలాడీ గర్ల్స్ విన్ అయ్యారు. కానీ పోటా పోటీగా ఇందులో టాస్కులు నిర్వహిస్తోంది శ్రీముఖి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
