Podharillu: ఆది ఎమోషనల్.. మహాలక్ష్మికి తాయారు ఏం చెప్పనుంది?
on Feb 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 51 లో.. మహా, కన్నా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు మీ అన్నయ్య అలా పారిపోతున్నాడని మహా అనగానే మిమ్మల్ని చూసే అని కన్నా అంటాడు. ఎన్నిరోజులు ఇలా పారిపోతాడని మహా అంటుంది. కొన్ని రోజుల్లో సెట్ అవుతాడని కన్నా అంటాడు. ఇక కాసేపటికి మహాకి ఆమ్లెట్ వేయడం ఎలాగో చెప్తాడు కన్నా. చక్రి, మహాల గురించి కన్నా చెప్పిన మాటలు తల్చుకొని ఆలోచిస్తుంది మహా.
మరోవైపు స్టైలిష్ శైలు తన ఫ్రెండ్ తో కలిసి ఒక గిఫ్ట్ షాప్ కి వెళ్తుంది. అక్కడ తనని ఇద్దరు, ముగ్గురు అయినా గుర్తుపడతారని తన ఫ్రెండ్ తో చెప్తుంది శైలు. ఇక అప్పుడే కేశవ, అతడి ఫ్రెండ్ వస్తారు. తనకి ఏ గిఫ్ట్ ఇష్టమో ఎలా తెలుస్తుందని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే శైలు దగ్గరికి గిఫ్ట్ గురించి అడుగగా.. నేను సేల్స్ గర్ల్ ని కాదని చెప్పి కేశవని తిడుతుంది. ఆ తర్వాత శైలు ఒక గిఫ్ట్ ని చూస్తుండగా అది విరిగిపోతుంది. ఎవరు చూడలేదని అనుకొని అక్కడే పెట్టేసి శైలు వెళ్ళిపోతుంటే కేశవ చూసి ఇలా రా.. ఈ బొమ్మని విడగొట్టి వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. అప్పుడే షాప్ లో ఉన్న అతను చూసి కేశవని డబ్బులు కట్టమని అంటాడు. ఇక శైలు, కేశవ ఇద్దరు గొడవపడతారు చివరికి కేశవ తప్పక ఆ విరిగిన దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రాత్రి ఇంట్లో అందరి కోసం మాధవ, కన్నా భోజనం ప్రిపేర్ చేస్తుంటారు.
వాళ్ళ దగ్గరికి మహా వచ్చి నేను హెల్ప్ చెయ్యాలా అని అడుగుతుంది. నీకు తెలియదులే అమ్మ నేను చేస్తానని మాధవ అంటాడు. ప్రతాప్, ఆది , హారిక, ఆది వాళ్ళ అమ్మ మహా గడిపే లైఫ్ తల్చుకొని బాధపడతారు. మరోవైపు మాధవ, కన్నా, చక్రి, మహా అందరు ఇంట్లో ఉండగా కేశవ ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. అది మహాకి ఇవ్వకుండా కన్నాకి ఇచ్చి వదినకి ఇవ్వమని చెప్తాడు. ఇక భయపడి గదిలోకి వెళ్ళి తొంగితొంగి చూస్తాడు కేశవ. ఈ కప్ నాకు బాగా నచ్చిందని మహా అంటుంది. ఇక రాత్రి అందరు కలిసి భోజనం చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళ నాన్న నారాయణని తీసుకొని వస్తేనే తింటానని మహా అనగానే నారాయణని తీసుకొని వస్తారు. ఇక తను తినేది చూసి మహా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత మహా బయట బట్టలు ఆరేస్తుంటే నారాయణ చెల్లెలు తాయారు వస్తుంది. ఏం పేరు అమ్మ అని మహాని అడగగా.. మహాలక్ష్మి అని చెప్తుంది. అప్పుడే నారాయణ వచ్చి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



