బిగ్ బాస్ హౌస్ లో గడుపుతున్న కీర్తి భట్ రెమ్యూనరేషన్ అంతా!?
on Sep 30, 2022

బుల్లితెర అభిమాన సీరియల్ గా 'కార్తీక దీపం' ఎంత పాపులరో అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సీరియల్ లో 'డాక్టర్ బాబు' కూతురిగా నటిస్తోంది ఎవరో కాదు,మన 'బిగ్ బాస్ హౌస్' లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ 'కీర్తిభట్'.
'కీర్తిభట్' పూర్తి పేరు 'కీర్తన కేశవ్ భట్'. ఈమె 'మంగళూరు' లో జన్మించింది. ఈమె చదువు అంతా కూడా బెంగుళూరులో సాగింది. ఈమెకు చిన్నప్పటినుండి 'ఆర్ట్స్' మరియు 'యాక్టింగ్' అంటే ఆసక్తి ఎక్కువ. ఈమె పైకి మాత్రమే నవ్వుతూ కనిపిస్తోంది. కానీ ఆ నవ్వు వెనుక చాలా విషాదమే దాగి ఉంది. అది ఏంటంటే ఒక 'ఆక్సిడెంట్'లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మ, నాన్న,అన్నయ్య,వదిన, అన్నయ్య వాళ్ళ పాప అందరు చనిపోయారు. తను కూడా వాళ్ళతోనే ఉంది కానీ ఈ 'ఆక్సిడెంట్'లో తను ఒక్కతే స్పృహ లేకుండా రోడ్డు పక్కన పడి ఉంది. ఆ తర్వాత దారిన పోయేవారు ఎవరో చూసి హాస్పిటల్ లో చేర్పించారు. స్పృహలోకి వచ్చాక 'తన తండ్రి చనిపోయాడు అనే విషయం తెలియడంతో నెల రోజుల పాటు 'కోమా'లోకి వెళ్ళిపోయింది. 'కోమా' నుండి బయటకొచ్చాక తన బంధువులు అందరూ కూడా తన 'ఆస్తులు' అన్నీ తీసుకొని రోడ్డు మీద వదిలేసారట. "నేను పడ్డ బాధ శత్రువులకు కూడా రావొద్దు" అని హౌస్ మేట్స్ తో చెప్పుకుంటూ బాధపడింది.
'యాక్సిడెంట్' జరిగినప్పుడు తనకు బలంగా గాయాలు అయ్యాయి. ఆ గాయాలలో ఎక్కువగా గర్భశయానికి తగలడంతో డాక్టర్లు గర్భాశయం తొలగించారు. ఇక తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. తను అనాధ ఆశ్రమం నుండి ఒక పాపని 'దత్తత' తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పాపకి నాలుగు సంవత్సరాల వయసు ఉంది. ఆ పాపని చూసుకోవడానికి ఒక సర్వెంట్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పాపే తన కుటుంబం అని చెప్పుకుంటోంది. పాప పేరు భాను. తను ఫస్ట్ యాక్ట్ చేసి పేరు తెచ్చుకున్న 'మనసిచ్చి చూడు' సీరియల్ లో క్యారెక్టర్ పేరు 'భాను' . అందువల్ల ఆ పేరుని పాపకి పెట్టిందంట. 'కీర్తిభట్' యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చాలా కష్టపడి నేర్చుకుంది అంట. ఆ తర్వాత 'మనసిచ్చి చూడు' సీరియల్ లో ఛాన్స్ వచ్చాక చాలా సంతోషంగా అనిపించిందంట. ఇక తర్వాత సీరియల్ లో బిజీగా మారిపోయిందంట. ప్రస్తుతం 'కార్తీక దీపం' సీరియల్ లో నటిస్తూ బాగా రాణిస్తోంది.
ఇక 'బిగ్ బాస్ హౌస్' లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన 'కీర్తిభట్'. మొదటి రోజు నుండే అందరితో కలివిడిగానే ఉన్నా, గేమ్ లో అంత పెర్ఫార్మన్స్ చూపించట్లేదు. ప్రతి వారం నామినేషన్లో ఉన్నా కూడా ప్రేక్షకులు ఓట్లు వేస్తూ, కీర్తి ని సేవ్ చేస్తున్నారు. అయితే రెండవ వారం నాగార్జున గట్టిగానే చెప్పినప్పటికీ, 'గేమ్'లో ఆక్టివ్ గా పాల్గొనలేదు. పర్ఫామెన్స్ బాగోలేదని శనివారం నాడు డైరెక్ట్ గా నామినెట్ చేసి హెచ్చరించాడు నాగార్జున. అయితే నాగార్జున ఇచ్చిన వార్నింగ్ కొద్దిగా పనిచేసిందని చెప్పొచ్చు. ఈ వారం అటలో ఓ మోస్తారుగా పర్ఫామెన్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. కానీ 'బిగ్ బాస్ హౌస్' లో ఉండటానికి ఇది సరిపోదు. ఇంకా బాగా చేస్తేనే బాగుంటుంది అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
'కీర్తిభట్' కి రెమ్యూనరేషన్ రోజుకి ముప్పై నుండి నలభై వేల వరకు ఉంటుంది అని బయట ప్రచారం జరుగుతోంది. అయితే తను ఈ వారం నామినేషన్ లో ఉంది. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ శాతం బాగానే ఉంది. ఆటలో పర్ఫార్మన్స్ ఏమీ లేకపోయినా ప్రేక్షకులు సింపతితో ఓట్లు వేస్తున్నారేమో అని 'బిగ్ బాస్ విశ్లేషకులు' అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



